Santosh Soban
Santosh Soban : సంతోష్ శోభన్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో సక్సెస్ కొట్టాడు. ప్రభాస్ కూడా వచ్చి ఈ సినిమాని మెచ్చుకొని, ఈ మూవీ టీమ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ చేసాడు. సంతోష్ శోభన్ తండ్రి ప్రభాస్ వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ అని అందరికి తెలిసిందే. అందుకే ప్రభాస్ కూడా సంతోష్ కి సపోర్ట్ చేస్తాడు.
సంతోష్ శోభన్ తండ్రి శోభన్ అనేక సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసి దర్శకుడిగా వర్షం, బాబీ, చంటి సినిమాలు తెరకెక్కించాడు. కానీ 40 ఏళ్ళ వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించాడు. తాజాగా సంతోష్ శోభన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి మరణం తర్వాత తన తల్లి గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.
Also Read : Vijay Rashmika : విజయ్ – రష్మిక.. సినిమాలు కాకుండా ఎవరికి ఏం బిజినెస్ లు ఉన్నాయో తెలుసా?
సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. మా అమ్మకు 32 ఏళ్ళు ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. అమ్మ చాలా కష్టపడింది. మేము చిన్నపిల్లలం. అమ్మ యోగా నేర్చుకొని యోగా టీచర్ గా పనిచేసింది. ఓ స్కూల్ లో పనిచేసింది. NGOలో పనిచేసింది ఒక విలేజ్ లో. ఆమె కష్టపడుతుంటే బాధగా అనిపించేది. నేను, తమ్ముడు నటులుగా మారినా బతకడానికి డబ్బుల కోసమే సినిమాలు చేస్తున్నాం అని అయిపోయింది. ఏక్ మినీ కథ సినిమా చేసినప్పుడు అమ్మా నువ్వు రిలాక్స్ అయిపో అని చెప్పాము. కొంచెం టైం పట్టింది కానీ అమ్మకి రెస్ట్ ఇచ్చాము.
సక్సెస్ లో ఉన్నప్పుడు అందరూ ఉంటారు. ఫెయిల్యూర్ లో ఎవరు ఉండరు అంటారు కానీ యూవీ క్రియేషన్స్ నా ఫెయిల్యూర్స్ లో కూడా ఉన్నారు. నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు. వంశీ, ప్రమోద్ అన్న బాగా సపోర్ట్ చేసారు. అందరూ నాన్న ఉంటే బాగుండు మా సక్సెస్ చూసి ఆనందించేవాళ్ళు అంటారు. కానీ నాన్న అందరిలో ఉన్నాడు కాబట్టే మేము ఇలా ఉన్నాం. మాకు సపోర్ట్ ఉంది. మా నాన్న ఎక్కడో ఉన్నాడు, చూస్తున్నాడు కాబట్టి ఇలా ఉన్నాము. ప్రభాస్ గారి సపోర్ట్ కూడా మాకు నాన్న వల్లే వచ్చింది అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.
Also Read : Prabhas : మీరు ప్రభాస్ ఫ్యాన్ కాకపోయినా.. అందరూ అనుకునేది అబద్దం.. ప్రభాస్ పై సంతోష్ శోభన్ కామెంట్స్ వైరల్..