Prabhas : మీరు ప్రభాస్ ఫ్యాన్ కాకపోయినా.. అందరూ అనుకునేది అబద్దం.. ప్రభాస్ పై సంతోష్ శోభన్ కామెంట్స్ వైరల్..
సంతోష్ శోభన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ప్రభాస్ తో చేసిన ఇంటర్వ్యూ గురించి, ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. (Prabhas)
Santosh Soban
Prabhas : సంతోష్ శోభన్ ఇటీవల కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో సక్సెస్ సాధించాడు. ఈ సినిమా ప్రభాస్ కి చెందిన యూవీ క్రియేషన్స్ లో నిర్మించడంతో మూవీ యూనిట్ సక్సెస్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రభాస్ తో చేసారు. ఆ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. సంతోష్ శోభన్ ప్రభాస్ వర్షం సినిమా దర్శకుడు శోభన్ తనయుడు అవ్వడంతో ముందు నుంచి సపోర్ట్ ఇచ్చాడు. సంతోష్ కూడా ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్.
తాజాగా సంతోష్ శోభన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ప్రభాస్ తో చేసిన ఇంటర్వ్యూ గురించి, ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
Also See : కోర్ట్ ఫేమ్ శ్రీదేవి – రోషన్ కొత్త సినిమా.. ‘బ్యాండ్ మేళం’ టీజర్ వచ్చేసింది..
సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. ప్రభాస్ గారు ఆ ఇంటర్వ్యూ చేయడం సినిమాకు పెద్ద బూస్ట్. ఆయన ప్రజెన్స్ కి ఉన్న వ్యాల్యూ నాకు తెలుసు. ఆయన్ని కలిసి 8 ఏళ్ళు అయిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాను. గొప్ప మనిషి. ఆ రోజు తన సినిమా షూటింగ్ చేసుకొని వచ్చి మరీ మాతో రెండు గంటలు ఉన్నారు. మర్చిపోలేని మూమెంట్ అది. నాకు ఇచ్చిన హగ్ నా ఒక్కడిది కాదు ఆయన్ని అభిమానించే అందరిది. అది లైఫ్ టైం మూమెంట్.
చాలామంది నేను, ప్రభాస్ క్లోజ్, రోజూ మాట్లాడుకుంటాం, వాళ్ళింటికి వెళ్లి భోజనం చేస్తాను అనుకుంటారు కానీ అవన్నీ అబద్దం. అది రియాలిటీ కాదు. ఆ ఇంటర్వ్యూ రోజు నాకు ఆయన లవ్ యు చెప్పాడు. నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అది. ఆయనకు మా సినిమా చాలా నచ్చింది. అయన ఒక క్రిటిక్ లా మా సినిమా గురించి మాట్లాడాడు. నా హీరో నా సినిమా చూసాడు అంటే ఆనందంగా ఉంది. మీరు ప్రభాస్ ఫ్యాన్స్ కాకపోయినా ఆయన్ని కలిసి ఒక 5 నిముషాలు మాట్లాడితే చాలు పెద్ద ఫ్యాన్ అయిపోతారు. ఆయనకు లవ్ ఇవ్వడం తప్ప ఇంకోటి తెలీదు. నేను ఆల్రెడీ చొక్కా చించుకుని ఫ్యాన్, ఆయన్ని కలిసాక ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఆయన మాతో సరదాగా హ్యాపీగా ఉన్నారు. సినిమా కలెక్షన్స్ కి ఆయన రావడం చాలా హెల్ప్ అయింది. ఆయనకు రుణపడి ఉంటాను అని అన్నారు.
Also Read : Mrunal Thakur : 60 ఏళ్ళ వయసులో కూడా నీతో రొమాన్స్ చేయాలని ఉంది.. మృణాల్ తో అతని కామెంట్స్ వైరల్..
దీంతో సంతోష్ శోభన్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
