బాలయ్య ముందే డైలాగ్ చెప్పిన సప్తగిరి

సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమా హీరో, కమెడియన్ సప్తగిరి రూలర్ ఆడియో ఫంక్షన్‌లో అదరగొట్టాడు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సప్తగిరి మాట్లాడాడు. ఈవెంట్ లో భాగంగా సినిమాలో నటించిన వారంతా తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే సప్తగిరి స్టేజ్ ఎక్కాడు. 

తాను హీరోగా చేసిన సినిమా సప్తగిరి ఎక్స్‌ప్రెస్ గురించి చెప్పారు. ఆ తర్వాత తాను ఆ సినిమాకు ముందే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నుంచి ఆశీస్సులు అందుకున్నట్లు తెలిపాడు. ఎలా అంటే ఆయన ఆశీస్సులతోనే తన సినిమాలో దానవీర శూర కర్ణ సినిమాలోని డైలాగ్ చెప్పగలిగినట్లు చెప్పాడు. 

అభిమానులు కోరితే, నటసింహం బాలకృష్ణ ఒప్పుకుంటే ఆ డైలాగ్ చెప్తానని అనుమతి కోరాడు. ఈలలు, కేరింతల మధ్యలో ఫ్యామస్ డైలాగ్ చెప్పాడు. ఏమంటివీ.. ఏమంటివీ అని మొదలుపెట్టి సుదీర్ఘమైన డైలాగ్ ఒక్కసారిగా చెప్పేశాడు. 

ఆగాగు…
ఆచార్య దేవా… 
ఏమంటివి ఏమంటివీ, జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా
ఎంతమాట.. ఎంతమాట
ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్షా కాదే, కాదు. కాకూడదు, ఇది కుల పరీక్ష ఏ అందువా,
నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా.. నీది ఏ కులమో?
ఇంత ఎలా?
అస్మత్పితామహుడు కురుకుల వృద్దుడైన ఈ శాంతనవుడు శివసముద్రల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా. ఈయనదే కులమో?

నాతో చెప్పింతువేమయ్యా..
మా వంశమునకు మూలపురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశీ పుత్రుడు కాడా ? అతడు పంచమ జాతి కన్యయైన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి ఛండాలంగుని యందు పరాశరుని , ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, వేద వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విధుర దేవుని కనలేదా? హహహాహ
సందర్భావసరములను బట్టి క్షేత్ర, బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కుల హీనమైనది. కాగా నేడు కులము కులము అను వ్యర్థ వాదమెందులకు ?

భీష్ముడి డైలాగ్:

నాయన శుయోధన యేరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించాధగినవి కావు ఇది నీ వన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరిక్షయే క్షాత్ర మున్నా వారేల్లరు క్షత్రియులే కాని అందులో రాజ్యమున్నవారే రాజులు అట్టి రాజులే ఈ కురు రాజు పరిక్ష్యత్లో పల్గొనుటకు అర్హులు.

ఓహో రాచరికమా అర్హతను నిర్ణయించునది…!
అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యమలమై సంపద విరలమై వెలుగొందుతున్న అంగ రాజ్యమునకు ఇప్పుడే ఇతడిని మోర్దాపశక్తుని గావించి వేశదను .సోదరా దుశ్యాశన అనర్గమున శక్తి కిరీటమును వేగముగ తెమ్ము ,
మామ గాంధార సార్వభౌమ సురుచిర మణిమండితమైన సువర్ణ సింహాసనమును తెప్పించుము,
పరిజనులరా పుణ్య భాగీరథీ నదీ తోయములు అందుకొనుడు , కళ్యాణ బద్దులార మంగలకుడియంబులు సుస్వరముగా మ్రోగనిండు, వంది మవిదులారా కర్ణ మహారాజును సేవరము గావింపుడు,
పున్యంగారులరా ఈ రాదాసుతునుకి పాలభాగమున కస్తూరీ తిలకమును తీర్చి దిద్ది బహుజన సుకృత కరీపాక శలభ్ద సహజ కవచ కష్ట వైడుర్య ప్రభాకించోటికి వాని చేగ వీర గంధమును విద్య రాల్పుడు !
నేను ఈ సకల జన సమూహ మున, పండిత పరిక్ష్యత్ మధ్యమున.,
సర్వదా సర్వదా సతదా సహసత్రదా పాప ప్రక్షాలమైన కుల కల్మషమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించెదా’ అని ముగించాడు.