Sara Arjun : రామ్ చరణ్ కోసం దురంధర్ బ్యూటీని తీసుకొస్తున్న సుక్కు..?
ధురంధర్ ఫేమ్ సారా అర్జున్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకునే అవకాశం ఉందంటున్నారు. (Sara Arjun)
- Saketh U
- Published on- August 20, 2026 / 10:23 AM IST
Sara Arjun
Sara Arjun : పెద్ది సినిమా తర్వాత రామ్‌చరణ్ నటించబోతున్న మూవీ RC17. రంగస్థలం తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో చరణ్ చేయబోతున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేసి గ్రాండ్‌గా లాంచ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో కాస్ట్ అండ్ క్రూపై ఇప్పడో ఇంట్రెస్టింగ్ గాసిప్ వైరల్ అవుతోంది.
ధురంధర్ ఫేమ్ సారా అర్జున్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకునే అవకాశం ఉందంటున్నారు. కథకు తగ్గట్టుగా కొత్త ఫేస్‌తో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న హీరోయిన్ కావాలనే ఆలోచనలో సుక్కు ఉన్నారట. సారా అర్జున్‌ను ఫైనల్ చేసే దిశగా చర్చలు జరుపుతున్నట్టు ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. దురంధర్ తర్వాత సారా అర్జున్‌పై బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల దృష్టిపడగా ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ సినిమాకు ఆమె పేరు వినిపించడం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Irumudi : రవితేజ ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎన్నికోట్లు కలెక్ట్ చేయాలి..?
చరణ్ సరసన సారా అర్జున్ నటించడం నిజమైతే సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో మరోసారి ఆసక్తికరమైన జోడీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడం పక్కా అన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో రంగస్థలంలో సమంతతో చరణ్‌కు అద్భుతమైన కెమిస్ట్రీ చూపించిన సుకుమార్ ఈ సారి పూర్తిగా కొత్త కాంబినేషన్‌ను తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నట్టు టాక్.
అయితే సారా అర్జున్ ఎంట్రీపై చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. టాలీవుడ్ లో రూమర్స్ మాత్రమే నడుస్తున్నాయి. సుక్కు, చరణ్ సినిమాలో హీరోయిన్‌గా సారా అర్జున్‌ను ఫైనల్ చేశారా.? లేక ఆమె పేరు కేవలం పరిశీలనలో మాత్రమే ఉందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Also See : Sapthami Gowda : చీరలో కాంతార భామ ఎంత అందంగా ఉందో.. సప్తమి గౌడ ఫొటోలు..
