Sarath Babu : నేడు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు..
నిన్న మే 22 రాత్రి వరకు అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం శరత్ బాబు భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. అనంతరం నిన్న రాత్రి శరత్ బాబు భౌతికకాయాన్ని చెన్నైకు తరలించారు.
- Saketh U
- Published On : May 23, 2023 / 07:45 AM IST
Sarath Babu's last rites in Chennai today
Sarath Babu : ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే నిన్న మే 22 సాయంత్రం మరణించారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో దాదాపు 3000కి పైగా సినిమాల్లో నటించారు శరత్ బాబు. ఆయన మరణంతో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
Sarath Babu : శరత్ బాబు మరణంపై సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు..
నిన్న మే 22 రాత్రి వరకు అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం శరత్ బాబు భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. అనంతరం నిన్న రాత్రి శరత్ బాబు భౌతికకాయాన్ని చెన్నైకు తరలించారు. నేడు మధ్యాహ్నం వరకు చెన్నైలోనే శరత్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నైలో కూడా పలువురు తమిళ సినీ ప్రముఖులు వచ్చి ఆయనకు నివాళులు అర్పించనున్నారు.
