Sarkaar : ‘సర్కార్’ని గెలవాలంటే డబ్బు ఒక్కటే కాదు.. ధిమాక్ కూడా ఉండాలి..

తెలుగు పాపులర్ ఓటీటీలో ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా సాలిడ్ గేమ్ షో ‘సర్కార్’..

Sarkaar Game Show On Aha

Sarkaar: బ్లాక్‌బస్టర్ సినిమాలు, అదిరిపోయే వెబ్‌సిరీస్‌లు, పాపులర్ టాక్ షోలతో.. తెలుగు ప్రేక్షకులకు వందశాతం వినోదాన్ని అందిస్తూ.. వారి మనసుల్లో స్థానం సంపాదించుకోవడమే కాక, డిజిటల్ రంగంలో ప్రథమ స్థానంలో కొనసాగుతుంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’.

Unstoppable Sneak Peak : కలుద్దాం.. ‘ఆహా’లో.. డిజిటల్ స్క్రీన్ దద్దరిల్లాల్సిందే..

ఇటీవలే ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అంటూ నటసింహా నందమూరి బాలకృష్ణతో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అనే షో ను అనౌన్స్ చేసి వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అయిన ‘ఆహా’ ఇప్పుడు సరికొత్త గేమ్ షో తో తమ ప్రేక్షకులకు మరింత ఆనందాన్నివ్వబోతోంది.

Unstoppable With NBK : బాలయ్య ఫ్యాన్స్‌తో ‘ఆహా’ ప్రమోషనల్ వీడియో

పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో కు ‘సర్కార్’ అనే సాలిడ్ టైటిల్‌తో పాటు ‘మీ పాటే నా ఆట’ అనే అదిరిపోయే ట్యాగ్‌లైన్ కూడా పెట్టారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ప్రోమో షో మీద అంచనాలు పెంచేసింది. అక్టోబర్ 29 నుండి ఈ షో స్ట్రీమింగ్ కానుంది.