CHAPRI : మరో బోల్డ్ సినిమాతో వస్తున్న బండి సరోజ్.. ‘ఛప్రి’ టీజర్ రిలీజ్..
CHAPRI TEASER : మాంగళ్యం, పరాక్రమం, నిర్భంధం.. లాంటి బోల్డ్ సినిమాలతో హీరోగా, దర్శకుడిగా మెప్పించిన బండి సరోజ్ కుమార్ ఇప్పుడు ‘ఛప్రి’ అనే మరో బోల్డ్ సినిమాతో రాబోతున్నాడు.
- Thota Vamshi Kumar
- Published on- November 15, 2026 / 09:39 AM IST
Saroj CHAPRI TEASER out
CHAPRI : మాంగళ్యం, పరాక్రమం, నిర్భంధం.. లాంటి బోల్డ్ సినిమాలతో హీరోగా, దర్శకుడిగా మెప్పించిన బండి సరోజ్ కుమార్ ఇప్పుడు ‘ఛప్రి’ అనే మరో బోల్డ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం, నిర్మాణం ఇలా చాలా బాధ్యతల్ని బండి సరోజ్ కుమార్ నిర్వహించడం గమనార్హం. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.
తాజాగా ఛప్రి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేసారు. మీరు కూడా టీజర్ చూసేయండి..
ఈ ఈవెంట్లో బండి సరోజ్ కుమార్ కుమార్ మాట్లాడుతూ.. ఛప్రి సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఫిబ్రవరిలో టీజర్ ప్లాన్ చేశాం. కానీ ఈ మగాడు సీన్‌ని ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ లీక్ చేశాడు. దాంతో నేను చాలా ట్రామాని అనుభవించాను. అందుకే టీజర్‌ను ఇంత ఫాస్ట్‌గా వదిలాం. ఇండస్ట్రీలో, సెట్లో మాకు సెక్యూరిటీ లేదు. ఈ కథను 700 రోజులు కష్టపడి రాశాను. రివ్యూయర్లను కూడా దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన స్క్రీన్ ప్లేని రాసుకున్నాను. సమ్మర్లో ఈ సినిమాతో మనమేంటో అందరికీ తెలుస్తుంది అని అన్నారు.
నటుడు ప్రవీణ్ మాట్లాడుతూ.. మోగ్లీ సినిమాలో బండి సరోజ్ కుమార్ ని చూసి నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి మాట్లాడాను. సరోజ్ తో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ చాలా కొత్తగా ఉంది అని అన్నారు. ప్రమోద్ పడమటి మాట్లాడుతూ.. బండి సరోజ్ కుమార్ తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ముందుగా మేం నిర్బంధంని నెట్ ఫ్లిక్స్ కోసం అనుకున్నాం. కానీ చివరకు యూట్యూబ్‌లోకి తీసుకు వచ్చాం. మాకు అక్కడ అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు థియేటర్లో ‘ఛప్రి’ దద్దరిల్లిపోతుంది అని అన్నారు.
