Sasivadane
Sasivadane : రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘శశివదనే'(Sasivadane). గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్లపై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మాణంలో సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
సంవత్సరం క్రితమే శశివదనే గ్లింప్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి ఆసక్తి నెలకొల్పారు. అప్పుడే ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రమోషన్స్ చేసారు. కానీ అనివార్య కారణాలతో శశివదనే సినిమా పలుమార్లు వాయిదా పడింది. గోదావరి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో క్యూట్, రస్టిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కించారు.
Also Read : OG : ఓజీ నుంచి రొమాంటిక్ సాంగ్..? ఎప్పుడో తెలుసా?
హిట్ 3 సక్సెస్ తర్వాత హీరోయిన్ కోమలీ కూడా తనకు లవ్ స్టోరీలు చేయాలని ఉందని, శశివదనే సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని తెలిపింది. తాజాగా శశివదనే సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు మూవీ యూనిట్. శశివదనే సినిమా దసరా తర్వాత అక్టోబర్ 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు. ఇటీవల మంచి క్యూట్ లవ్ జానర్ సినిమాలు రావట్లేదు. మరి శశివదనే సినిమా ఆ లోటుని భర్తీ చేస్తుందేమో చూడాలి.
Also Read : Thiruveer : తండ్రి కాబోతున్న హీరో.. భార్యకు ఘనంగా సీమంతం..