Satyabhama : వరంగల్‌లో ‘సత్యభామ’ సీరియల్ నటీనటుల సందడి.. ప్రేక్షకులతో కలిసి ఆటపాటలు..

వరంగల్‌ ప్రేక్షకులను కలిసి 'సత్యభామ' సీరియల్ నటీనటుల ఆటపాటలతో సందడి చేసారు.

Satyabhama serial actors interact with warangal audiene

Satyabhama : ఇటీవల టీవీ సీరియల్స్ మేకర్స్ ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రేక్షకులను నేరుగా కలుస్తూ, వారితో ఓ ప్రత్యేక ఎపిసోడ్ చేయడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘సత్యభామ’ సీరియల్ మేకర్స్.. వరంగల్‌ ప్రేక్షకులను కలిసి, వారితో ఆటపాటలు ఆడి సందడి చేసారు.

ఎంతోకాలంగా సత్యభామ అభిమానులు ఎదురుచూస్తున్న క్రిష్‌, సత్యభామల ఆన్-స్క్రీన్ వివాహాన్ని ఈ కార్యక్రమంలో చూపించారు. వివాహ రిసెప్షన్ తో ఓ ప్రత్యేక ఈవెంట్ ని చేసారు. వరంగల్‌లోని వెంకటేశ్వర కన్వెన్షన్ గార్డెన్‌లో మార్చి 10న ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి ఈ రిసెప్షన్ ని నిర్వహించారు. సీరియల్ నటీనటులతో కలిసి ప్రేక్షకులు సరదాగా ఎంజాయ్ చేసారు.

Also read : Market Mahalakshmi Trailer : ‘మార్కెట్ మహాలక్ష్మి’ ట్రైలర్ వచ్చేసింది.. సావిత్రి, సౌందర్య, సాయి పల్లవి లాంటి..

ఇక ఈ ఈవెంట్ లో క్రిష్‌, సత్యభామలు కలిసి డాన్స్ వేసి ఆడియన్స్ ని మరింత సంతోష పరిచారు. కాగా భవిష్యత్తులో ఇలాంటి ఆహ్లాదపరిచే కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు మళ్ళీ వస్తామంటూ సీరియల్ నిర్వాహుకులు ఆడియన్స్ తో చెప్పుకొచ్చారు. కాగా ప్రేమకథతో ఆకట్టుకుంటున్న ఈ సత్యభామ సీరియల్.. ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకి స్టార్ మాలో ప్రసారమవతుంది.

ట్రెండింగ్ వార్తలు