Market Mahalakshmi Trailer : ‘మార్కెట్ మహాలక్ష్మి’ ట్రైలర్ వచ్చేసింది.. సావిత్రి, సౌందర్య, సాయి పల్లవి లాంటి..

పార్వతీశం హీరోగా నటిస్తున్న 'మార్కెట్ మహాలక్ష్మి' ట్రైలర్ వచ్చేసింది.. సావిత్రి, సౌందర్య, సాయి పల్లవి లాంటి..

Market Mahalakshmi Trailer : ‘మార్కెట్ మహాలక్ష్మి’ ట్రైలర్ వచ్చేసింది.. సావిత్రి, సౌందర్య, సాయి పల్లవి లాంటి..

Parvateesam Praneekaanvikaa Market Mahalakshmi Trailer released

Updated On : March 11, 2024 / 8:04 PM IST

Market Mahalakshmi Trailer : ‘కేరింత’ సినిమాలో నూకరాజుగా కామెడీ పండించిన పార్వతీశం.. ఇప్పుడు హీరోగా కనిపిస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న సినిమా ‘మార్కెట్ మహాలక్ష్మి’. కొత్త దర్శకుడు వియస్ ముఖేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రణీకాన్వికా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు.

ట్రైలర్ కూడా టీజర్ లా ఎంటర్టైనింగా ఉంది. 90’s అబ్బాయిల్లో చాలామంది సావిత్రి, సౌందర్యని, రీసెంట్ గా అంటే సాయి పల్లవిని ప్రత్యేకంగా అభిమానిస్తుంటారు. తాము చేసుకొనే అమ్మాయి కూడా వారికి లాగానే ఉండాలని కలలు కంటుంటారు. అలాంటి ఓ అబ్బాయి కథే.. ఈ ‘మార్కెట్ మహాలక్ష్మి’ అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. భారీ కట్నం కోసమే తండ్రి, కానీ కొడుకు ఏమో మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే ఓ రఫ్ అండ్ టఫ్ అమ్మాయికి పడిపోవడం. ఈ మొత్తం కథని ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది.

Also read : John Cena : అందర్నీ ఫూల్స్ చేసిన జాన్‌సీన.. ఆస్కార్ వేదికపైకి నగ్నంగా రాలేదా.. ఫుల్ ఫోటో రిలీజ్..

బి2పి స్టూడియోస్ పతాకం పై అఖిలేష్ కలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు. ట్రైలర్ అయితే ఆడియన్స్ ని ఆకట్టుకునేలాగానే ఉంది. అమృతం హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మిష్టర్ జో సంగీతం అందిస్తుంటే సృజన శశాంక బ్యాగ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. మరి మన నూకరాజు అలియాస్ పార్వతీశం ఈ సినిమాతో ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి.