John Cena : అందర్నీ ఫూల్స్ చేసిన జాన్‌సీన.. ఆస్కార్ వేదికపైకి నగ్నంగా రాలేదా.. ఫుల్ ఫోటో రిలీజ్..
ఆస్కార్ వేదికపైకి నగ్నంగా రాలేదా. జాన్‌సీన అందర్నీ ఫూల్స్ చేసేసారుగా. బ్యాక్ స్టేజిలో జాన్‌సీన ఫుల్ ఫోటో వైరల్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

John Cena didnt come onto the oscar stage in a full naked getup
John Cena : పాపులర్ అమెరికన్ రెజ్లర్ జాన్‌సీన.. WWE షోలతో మాత్రమే కాకుండా, సినిమాల్లో కూడా నటించి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. తాజాగా రెజ్లర్ కమ్ యాక్టర్ ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్నారు. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగిన 96వ ఆస్కార్ వేడుకల్లో జాన్‌సీన.. ఒంటిమీద ఏమి లేకుండా నగ్నంగా కనిపించి అందర్నీ షాక్ కి గురి చేసారు.
#JohnCena while announcing best Costume Designer Award.#Oscars2024 #Oscars
pic.twitter.com/jPwIUo5rYj pic.twitter.com/ZYllZxmmvA
— Ramzan IDREES (@Ramzanidrees90) March 11, 2024
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డుని ప్రకటించడానికి వేదిక పైకి వచ్చిన జాన్‌సీన.. కేవలం తన ప్రైవేట్ పార్ట్ వద్ద ఓ అట్టముక్క అడ్డం పెట్టుకొని దర్శనం ఇచ్చి అందర్నీ షాక్ కి గురి చేసారు. సినిమాలో కాస్ట్యూమ్ డిజైనింగ్ ఎంత ముఖ్యం అని తెలియజేయడం కోసం ఆస్కార్ నిర్వాహుకులు.. ఇలా కొత్తగా ట్రై చేసారు. ఇక ఇది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే జాన్‌సీన స్టేజి పైకి నగ్నంగా రాలేదట.
Also read : Nitin Chandrakant Desai : ఆస్కార్ వేదికపై.. దివంగత ఇండియన్ ఆర్ట్ డైరెక్టర్ జ్ఞాపకాలు..
తన ప్రైవేట్ పార్ట్ ని ఆల్రెడీ ఒక బట్టతో కవర్ చేసి ఉంచారు. అయితే స్టేజి పైకి వచ్చినప్పుడు.. ఆ బట్ట ముక్క కూడా కనిపించకుండా అట్టముక్కని అడ్డం పెట్టుకోవడంతో జాన్‌సీన స్టేజి పైకి నగ్నంగా వచ్చారని అందరూ భావించారు. కానీ ఆయన అర్ధనగ్నంగా వచ్చారని బ్యాక్ స్టేజి ఫోటో రిలీజ్ అయితే గాని తెలియలేదు. స్టేజి పైకి ఎంట్రీ ఇచ్చేముందు.. బ్యాక్ స్టేజిలో జాన్‌సీన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా స్టేజి పైకి ఇలా అర్ధనగ్నంగా వచ్చిన జాన్‌సీన మాట్లాడుతూ.. ‘కాస్ట్యూమ్స్ అందుకే ఇంపార్టెంట్’ అని వ్యాఖ్యానించారు. ఆ మాటలకి థియేటర్లో ఉన్న వారంతా నవ్వుకున్నారు. ఇక ఆ తరువాత వెంటనే కొంతమంది వచ్చి జాన్‌సీనని కాస్ట్యూమ్స్ తో సిద్ధం చేసేసారు. కాగా ఈ ఏడాది బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డుని పూర్ థింగ్స్ సినిమాకు గాను హోలి వెడ్డింగ్‌టన్ అందుకున్నారు.