Bigg Boss 9 Telugu: ఇదేం క్రేజ్ సామీ.. సెకండ్ వీక్ వోటింగ్ టాప్ లో సుమన్ శెట్టి.. మర్యాదగా ఎలిమినేట్ అవుతున్న కామనర్

బిగ్ బాస్ సీజన్ 9లో సెకండ్ వీక్ ఎలిమినేషన్ కి టైం దగ్గర పడింది. ఇప్పటికే ఈ సీజన్(Bigg Boss 9 Telugu) మొదటి ఎలిమినేషన్ గా శ్రష్టి వర్మ బయటకు వెళ్లిన విషయం తెలిసిందే.

Second week elimination in Bigg Boss Season 9

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9లో సెకండ్ వీక్ ఎలిమినేషన్ కి టైం దగ్గర పడింది. ఇప్పటికే ఈ సీజన్ మొదటి ఎలిమినేషన్ గా శ్రష్టి వర్మ బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. దాంతో, ఈవారం ఖచ్చితంగా కామనార్ ఎలిమినేట్ అవుతారంటూ నెటిజన్స్, ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక రెండోవారం విషయానికి వస్తే, సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా సైని, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, డీమాన్ పవన్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎప్పటిలాగానే(Bigg Boss 9 Telugu) సుమన్ శెట్టి 42 శాతం ఓటింగ్ తో టాప్ లో ఉన్నారు.

Hema: మంచు లక్ష్మి ఎపిసోడ్.. మంచు విష్ణుపై హేమ ఫైర్

అసలు ఈయన క్రేజ్ మాములుగా లేదు. టాస్కులు పెద్దగా ఆడకపోయినా, హౌస్ లో ఏ విషయంలో కూడా ఇన్షియేట్ తీసుకోకపోయినా ఆడియన్స్ ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. 42 శాతం వోటింగ్ అంటే మాములు విషయం కాదు. ఇక ముందు కూడా ఈ వోటింగ్ ఇలాగే కొనసాగుతుందా అనేది చూడాలి. ఇక రెండవ స్థానంలో భరణి ఉన్నాడు. ఈయనకు 25 శాతం వోటింగ్ నమోదు అయ్యింది. కొన్ని సిచువేషన్స్ లో ఆయన తీసుకుంటున్న స్టాండ్స్ ఆడియన్స్ ను నచ్చుతున్నాయి. ఇక 7 శాతం వోటింగ్ తో ఫ్లోరా మూడవ స్థానంలో ఉన్నారు.

ఇక కామనార్స్ విషయానికి వస్తే, ప్రియా శెట్టి కి 7 శాతం ఓట్లు పడ్డాయి. కాబట్టి ఈవారం ఆమె ఎలిమినటేశన్ నుంచి తప్పించుకుంది అనే చెప్పాలి. ఆ తరువాతి స్థానాల్లో 6.9 శాతం ఓట్లతో డిమాన్ పవన్, 6.6 శాతం ఓట్లతో హరిత హరీష్ ఉన్నారు. గతవారం హరిత హరీష్ ప్రవర్తనకు ఆడియన్స్ చిరాకుగా ఉన్నారు. అందుకే ఆయనకీ తక్కువగా ఓటుంగ్ నమోదు అయ్యింది. ఇక అందరికంటే లీస్ట్ పొజిషన్లో ఉన్న మర్యాద మనీష్ రెండోవారం ఎలిమినేట్ అవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదైనా అద్భుతం జరిగి అతను సేవ్ అయితే అవ్వోచ్చేమో కానీ, వోటింగ్ లో మాత్రం మర్యాద మనీష్ లీస్ట్ పొజిషన్ లో ఉన్నాడు.