Secret Soldier : మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ వరకు వెళ్లిన సినిమా.. చైనా పీస్ నుంచి సీక్రెట్ సోల్జర్ గా..

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. (Secret Soldier)

  • Published on- September 12, 2026 / 08:41 PM IST

Secret Soldier

Secret Soldier : నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా సీక్రెట్ సోల్జర్. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో యూనిక్ స్పై డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సీక్రెట్ సోల్జర్ సినిమా సెప్టెంబర్ 18న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ‘చైనా పీస్’ టైటిల్ ని ‘సీక్రెట్ సోల్జర్’గా మార్చడంపై స్పందిస్తూ.. చైనా పీస్ పేరుతోనే టీజర్ రిలీజ్ చేసాము. రెండు పాటలు రిలీజ్ చేసి మార్కెటింగ్ కూడా చేశాం. మార్చిలో సినిమా రిలీజ్ చేద్దామని సెన్సార్‌కు వెళ్తే అభ్యంతరాలు వచ్చాయి. రివ్యూ కమిటీలు, సెన్సార్ చైర్మన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్.. ఇలా అన్ని స్థాయిలు వరకు ఈ సినిమా రివ్యూకి వెళ్ళింది. చాలా పాయింట్స్ చెప్పారు. అందులో టైటిల్ ‘చైనా పీస్’ ఉండకూడదు అన్నారు. దాంతో కథని ఆధారంగా చేసుకొని ‘సీక్రెట్ సోల్జర్’ అని పెట్టాం. సెన్సార్‌లోనే దాదాపు 8 నెలలు ఉండిపోయింది. విజువల్స్ లో చిన్న కట్స్‌ కూడా చెప్పారు అని తెలిపారు.

Also See : Roja Daughter Anshu : షార్ట్ స్కర్ట్‌లో రోజా కూతురు.. అన్షు సెల్వమణి ఫొటోలు..

ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది ఒక స్పై డ్రామా. స్పై యాక్షన్ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇండియా కి సంబధించిన ఒక కీలక ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. ఆ సంఘటనకి నెల్లూరులో చాలా సాదాసీదాగా బతికే ఇద్దరు కుర్రాళ్లకి లింక్ ఏమిటి? ఆ సమస్యను పరిష్కరించారా అనేదే కథ. ఫస్ట్ హాఫ్ లో ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్ బాగుంటాయి. మా ఇద్దరి క్యారెక్టర్స్ స్పై వరల్డ్‌లోకి వచ్చాక ఇంకా బాగుంటుంది సినిమా. ఇందులో స్నేహం, దేశభక్తి రెండు ఎమోషన్స్‌ ఉంటాయి. గూఢచారులు ఎప్పుడూ చాలా సాధారణంగా మన మధ్యనే ఉంటారు. వాళ్లు అసలు గూఢచారులనే సంగతి మనకు అర్థం కాదు. మా సినిమాలో కూడా అలాగే ఉంటారు. ఈ సినిమాలో చాలా అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ కూడా ఉంది అని తెలిపారు.

అలాగే.. మా సినిమాని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, సినీ పరిశ్రమకు సంబంధం లేని ఆడియన్స్‌ను తీసుకొచ్చి చూపించాం. చూసిన వాళ్లందరూ కూడా సినిమా బాగుంది అన్నారు. ఇండస్ట్రీలో చూసిన వాళ్ళు ఇది పెద్ద స్టార్స్ చేయాల్సిన సినిమా, ఆ రేంజ్ లో ఉంది అని అన్నట్టు తెలిపారు.

Also Read : Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం AK47 టీజ‌ర్ వ‌చ్చేసింది.. న‌వ్వులే న‌వ్వులు..

ఇక నిహాల్ తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా తర్వాత ఈటీవీ విన్ తో ఒక సినిమా చేస్తున్నాను. సాయిరాజేష్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాను అని తెలిపారు. సూర్య శ్రీనివాస్.. బాబీ సింహతో కలిసి బైలింగ్వల్ సినిమా చేస్తున్నాను. అంతా రాములోరు చూసుకుంటారు సినిమాలో సెకండ్ లీడ్ చేస్తున్నాను అని తెలిపారు.