Sekhar Kammula Launch Aravind Joshua Passion Movie First Look
passion : సుధీస్, అంకిత హీరో హీరోయిన్స్ గా అరవింద్ జాషువా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పేషన్’. రెడ్ యాంట్ క్రియేషన్ బ్యానర్ పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు.
ఫస్ట్ లుక్ లాంచ్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. అరవింద్ జాషువా ఆనంద్ సినిమా నుంచి నాకు పరిచయం. అప్పట్లోనే తనలో స్టోరీ టెల్లింగ్ క్రియేటర్ ఉన్నాడని అనిపించింది. తను పేషన్ అని ఒక నవల రాశారు. అది నేను చదివాను. చాలా బాగుంది. తను వచ్చిన ఫ్యాషన్ బ్యాక్ గ్రౌండ్ అందులో ఉంటుంది. దాన్ని ఇప్పుడు సినిమాగా మలుస్తున్నారు. పోస్టర్ డిజైన్ చాలా బాగుంది అని తెలిపారు.
Also Read : Naga Chaitanya : ఈ యూట్యూబర్ నాగచైతన్యకు అంత క్లోజ్ ఫ్రెండా? ఫ్రెండ్ బాధలో ఉంటే చైతూ..
ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. నవల చదివిన తర్వాత అందరూ ఇన్స్పైర్ అయి మూవీగా తీసుకురావాలనే తపనని అర్థం చేసుకున్నారు. శేఖర్ కమ్ముల గారి బ్లెస్సింగ్స్ లేకపోతే ఈ మూవీ అయ్యేది కాదు అని అన్నారు.
డైరెక్టర్ అరవింద్ జాషువా మాట్లాడుతూ.. పేషన్ సినిమా కాన్వాస్ చాలా పెద్దది. చాలా పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు చదివే ఒక ఫ్యాషన్ కాలేజీలో నాలాంటి ఒక సామాన్యుడు చదివితే ఎలా ఉంటుందో ఒరిజినల్ గా నేను ఫీల్ అయి రాసిన కథ ఇది. శేఖర్ కమ్ముల గారికి నేను ఏకలవ్య శిష్యుడ్ని. ఆయనతో 20 ఏళ్ల జర్నీ ఉంది. టైటిల్ కి తగ్గట్టు ఇది ఇంటెన్స్ ఎమోషన్స్ తో కూడిన లవ్ స్టోరీ. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది అని తెలిపారు.
Also Read : Deepika Rangaraju : అందర్నీ నవ్వించే సీరియల్ నటి ‘దీపికా రంగరాజు’.. ఆమె మనసులో ఇంత బాధ ఉందా.. ఏంటో తెలుసా?