Naga Chaitanya : ఈ యూట్యూబర్ నాగచైతన్యకు అంత క్లోజ్ ఫ్రెండా? ఫ్రెండ్ బాధలో ఉంటే చైతూ..
నాగచైతన్యకు కూడా ఇండస్ట్రీ బయట చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో యూట్యూబర్ రవితేజ్ ఒకరు.

Do You Know Naga Chaitanya and Youtuber Street Byte Ravitej Friendship
Naga Chaitanya : మన సినిమా సెలబ్రిటీలకు సినీ పరిశ్రమలోనే కాక బయట కూడా మంచి ఫ్రెండ్స్ ఉంటారు. అలా నాగచైతన్యకు కూడా ఇండస్ట్రీ బయట చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో యూట్యూబర్ రవితేజ్ ఒకరు. టాప్ తెలుగు ఫుడ్ యూట్యూబ్ ఛానల్స్ లో ఒకటైన స్ట్రీట్ బైట్ అందరికి తెలిసిందే. ఈ ఛానల్ లో రవితేజ్ అనే వ్యక్తి గత 12 ఏళ్లుగా ఫుడ్స్, రెస్టారెంట్స్ గురించి పరిచయం చేస్తూ ఫేమస్ అయ్యాడు.
నాగచైతన్యకు ఫుడ్ అంటే ఇష్టం. దాంతో కరోనా సమయంలో షోయు అనే ఓ క్లౌడ్ కిచెన్ స్థాపించాడు. అది సక్సెస్ అవ్వడంతో ఈసారి స్కుజి అనే పేరుతో మరో క్లౌడ్ కిచెన్ ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ రెండూ మంచి సక్సెస్ తో రన్ అవుతున్నాయి. ఇలా రెస్టారెంట్ ఫుడ్ ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య – రవితేజ్ కలిశారు.
Also Read : Sanjay Thumma : వాళ్ళ భార్యలు ఆ పని చేయడం వల్ల నాతో ఫ్రెండ్షిప్ వదులుకున్నారు.. స్టార్ చెఫ్ ఆవేదన..
ఓ మూడు రోజుల క్రితం నాగచైతన్య కొత్త కౌడ్ కిచెన్ స్కూజి ని ప్రమోట్ చేస్తూ రవితేజ్ వీడియో చేసాడు. ఈ క్రమంలో నాగచైతన్య రవి తనకు మంచి ఫ్రెండ్ అని తెలిపాడు. రవి కూడా.. ఇటీవల బాబు పుట్టిన సమయంలో కొన్ని కష్టాల్లో ఉంటే బాధలో ఉంటే చైతూ ఫోన్ చేసి మాట్లాడారని, ఇంటికి పిలిచి రెండు గంటల సేపు మాట్లాడి సపోర్ట్ ఇచ్చాడని తెలిపాడు. అలాగే రవి తినే విధానం, రవి బిజినెస్, వీడియోలు తనకు ఇష్టమని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఈ వీడియోలో ఇద్దరూ చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఫుడ్ గురించి ప్రమోట్ చేసారు.
దీంతో ఈ ఇద్దరి మధ్య ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరికీ ఫుడ్ మీద ఉన్న ప్యాషన్ తో బాగా కనెక్ట్ అయ్యారని, ఇద్దరికీ ఫుడ్ బిజినెస్ లు ఉన్నాయని, ఇద్దరి మధ్య హ్యూమర్ కూడా బాగా కనెక్ట్ అవ్వడంతో మంచి ఫ్రెండ్స్ అయ్యారని తెలుస్తుంది.
Also Read : Deepika Rangaraju : అందర్నీ నవ్వించే సీరియల్ నటి ‘దీపికా రంగరాజు’.. ఆమె మనసులో ఇంత బాధ ఉందా.. ఏంటో తెలుసా?