Sanjay Thumma : వాళ్ళ భార్యలు ఆ పని చేయడం వల్ల నాతో ఫ్రెండ్షిప్ వదులుకున్నారు.. స్టార్ చెఫ్ ఆవేదన..
తెలుగు రాష్ట్రాల నుంచి వరల్డ్ వైడ్ ఫేమస్ తెచ్చుకున్న చెఫ్ లలో సంజయ్ ఒకరు.

Sanjay Thumma gets Emotional he Loss his Friends Due to Cooking
Sanjay Thumma : స్టార్ చెఫ్ గా సంజయ్ తుమ్మ మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. కుకింగ్ వీడియోలతో, మాస్టర్ చెఫ్ లాంటి టీవీ షోలతో, తన వంటలతో బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు సంజయ్ తుమ్మ. తెలుగు రాష్ట్రాల నుంచి వరల్డ్ వైడ్ ఫేమస్ తెచ్చుకున్న చెఫ్ లలో సంజయ్ ఒకరు.
సంజయ్ తాజాగా ఆహా ఓటీటీలో కాకమ్మ కథలు ఇంటర్వ్యూ షోకి వచ్చారు. ఈ షోలో వంటల వల్ల చిన్నప్పట్నుంచి తన ఫ్రెండ్స్ తనని వదిలేశారని ఎమోషనల్ అయ్యాడు.
Also Read : Deepika Rangaraju : అందర్నీ నవ్వించే సీరియల్ నటి ‘దీపికా రంగరాజు’.. ఆమె మనసులో ఇంత బాధ ఉందా.. ఏంటో తెలుసా?
సంజయ్ తుమ్మ మాట్లాడుతూ.. నా కుకింగ్ వల్ల చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ దూరమయ్యారు. నాకు చిన్నప్పటి నుంచి వంట ఇష్టం. చిన్నప్పుడు అబ్బాయిలు క్రికెట్ ఆడుతుంటే నేను అమ్మాయిలతో కలిసి వంట చేసేవాడ్ని. అమ్మాయిలతో వంట చేస్తున్నాను అని చిన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ దూరమయ్యారు. ఇప్పుడు స్టార్ చెఫ్ అయ్యాక కూడా కొంతమంది ఫ్రెండ్స్ దూరమయ్యారు. నా ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్ బెడ్ రూమ్ లో కూర్చొని నా కుకింగ్ వీడియోలు చూస్తుందని నాతో ఫ్రెండ్షిప్ వదులుకున్నారు. వాళ్ళ బెడ్ రూమ్ లో నేను, నా వీడియోలు ఉన్నాయని ఫీల్ అయ్యారు. నా వంటలు చూసి నేర్చుకుంటున్నారు, కానీ అది అర్ధం చేసుకోకుండా నన్ను దూరం పెట్టారు అంటూ తన కుకింగ్ వల్ల ఫ్రెండ్స్ దూరమయ్యారని తెలిపాడు.
Also Read : Subham Trailer : సమంత నిర్మాతగా మొదటి సినిమా.. ‘శుభం’ ట్రైలర్ వచ్చేసింది.. సమంత గెస్ట్ రోల్ లో..