Subham Trailer : సమంత నిర్మాతగా మొదటి సినిమా.. ‘శుభం’ ట్రైలర్ వచ్చేసింది.. సమంత గెస్ట్ రోల్ లో..
మీరు కూడా శుభం సినిమా ట్రైలర్ చూసేయండి..

Shriya Kontham Samantha Subham Movie Trailer Released
Subham Trailer : హీరోయిన్ గా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ప్రస్తుతం నిర్మాతగా సినిమాలు మొదలుపెట్టింది. సమంత నిర్మాతగా మొదటి సినిమా శుభం అని ఇటీవల ప్రకటించి టీజర్ కూడా రిలీజ్ చేసింది. ట్రాలాలా బ్యానర్ పై సమంత నిర్మాణంలో ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఈ శుభం సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Sekhar Master : ఏ కొరియోగ్రాఫర్ కి రాని అదృష్టం నాకు వచ్చింది.. చిరంజీవి – చరణ్ సర్స్ తో రెండు సార్లు..
హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రియ కొణతం, షాలిని కొండేపూడి.. పలువురు కీలక పాత్రల్లో ఈ శుభం సినిమా తెరకెక్కుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హారర్ కామెడీ సినిమాగా తెరకెక్కుతుంది. తాజాగా శుభం సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా శుభం సినిమా ట్రైలర్ చూసేయండి..
ఈ ట్రైలర్ చూస్తుంటే సీరియల్స్ చూసి, దయ్యాలు ఆవహించి భార్యలు భర్తల్ని కొడుతున్నట్టు, మగవాళ్ళని టార్గెట్ చేసినట్టు హారర్ కామెడీగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని మే 9 రిలీజ్ కానుంది.
Also Read : Sekhar Master : సూర్య సర్ సినిమాకు 15 నిముషాలు లేట్.. చాలా బాధపడ్డాను..