Deepika Rangaraju : అందర్నీ నవ్వించే సీరియల్ నటి ‘దీపికా రంగరాజు’.. ఆమె మనసులో ఇంత బాధ ఉందా.. ఏంటో తెలుసా?
ఈ షోలో దీపికా రంగరాజు తన మనసులో ఉన్న బాధని బయటపెట్టింది.

Serial Actress Deepika Rangaraju Tells about her Sad Part of Life and Gets Emotional
Deepika Rangaraju : ఇటీవల బ్రహ్మముడి సీరియల్, టీవీ షోలలో ఫుల్ సందడి చేస్తూ బాగా వైరల్ అయింది నటి దీపికా రంగరాజు. రెగ్యులర్ గా ఏదో ఒక టీవీ షో, సీరియల్ లో కనిపిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తుంది. షోలలో దీపికా రంగరాజు అందర్నీ ఫుల్ ఎంటర్టైన్ చేస్తుండటంతో బాగా ఫేమ్ తెచ్చుకొని ఫ్యాన్స్ ని, ఫాలోవర్స్ ని సంపాదించుకుంది.
తాజాగా దీపికా రంగరాజు ఆహా ఓటీటీలో వచ్చే కాకమ్మ కథలు అనే ఇంటర్వ్యూ షోకి వచ్చింది. ఈ షోలో దీపికా రంగరాజు తన మనసులో ఉన్న బాధని బయటపెట్టింది.
Also Read : Subham Trailer : సమంత నిర్మాతగా మొదటి సినిమా.. ‘శుభం’ ట్రైలర్ వచ్చేసింది.. సమంత గెస్ట్ రోల్ లో..
దీపికా రంగరాజు మాట్లాడుతూ.. నేను యాక్టింగ్ చేస్తున్నాను అని ఇంట్లోకి పేరెంట్స్ రానివ్వలేదు. నాకు సపోర్ట్ చెయ్యట్లేదు. లాస్ట్ 2 ఇయర్స్ లో నేను బాగా ఎదిగినా నన్ను అభినందించలేదు. నన్ను మోటివేట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు, నన్ను నేనే మోటివేట్ చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. నేను మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతాను, జాబ్ తెచ్చుకుంటాను అని చెప్తే అప్పుడు ఇంట్లోకి రానిస్తారు. ఎవరూ లేకుండా మనమే మోటివేట్ అవ్వాలి, మనమే ముందుకెళ్లాలి అంటే కొన్ని సార్లు బాధేస్తుంది, బోర్ కొడుతుంది అంటూ కాస్త ఎమోషనల్ అయింది.
దీంతో దీపికా రంగరాజు యాక్టింగ్ చేస్తుందని ఇంట్లోంచి పంపించేసినట్టు, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేనట్టు తెలుస్తుంది. అందర్నీ నవ్వించే దీపికా రంగరాజు మనసులో ఇంత బాధ ఉందా అని ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
Also Read : Sekhar Master : ఏ కొరియోగ్రాఫర్ కి రాని అదృష్టం నాకు వచ్చింది.. చిరంజీవి – చరణ్ సర్స్ తో రెండు సార్లు..