Sekhar – Ganesh : స్టేజిపై ఎమోషనల్ అయిన గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్.. అప్పటి రోజులను గుర్తుచేసుకొని..

తాజాగా ప్రముఖ డ్యాన్స్ షో 'ఢీ'లో గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు.

Sekhar Master and Ganesh Master Emotiona on Dhee Show Stage Promo goes Viral

Sekhar – Ganesh : పలు టీవీ షోలలో సెలబ్రిటీలు అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతారని తెలిసిందే. తాజాగా ప్రముఖ డ్యాన్స్ షో ‘ఢీ’లో గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఢీ సెలబ్రెటీ సీజన్ 2 నడుస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో టీచర్స్ డే సందర్భంగా ఇప్పుడు ఢీలో ఉన్న మాస్టర్స్ స్పెషల్ పర్ఫార్మెన్స్ చేసారు.

శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ ఢీలో చేసినప్పటి పర్ఫార్మెన్స్ లు గుర్తుచేస్తూ ఈ టీచర్స్ డే స్పెషల్ పర్ఫార్మెన్స్ చేసారు. దీంతో ఈ షోలో జడ్జిలుగా ఉన్న గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. తమ కెరీర్ ఆరంభంలో తాము చేసింది చూపించి మళ్ళీ అప్పటి రోజులని గుర్తుచేసి ఎమోషనల్ చేసారని అన్నారు గణేష్ మాస్టర్.

Also Read : Prabhas – Sandeep Reddy Vanga : ‘యానిమల్’కి ముందే ప్రభాస్ నన్ను పిలిచి హాలీవుడ్ రీమేక్ చేయమన్నారు.. నేను నో చెప్పి..

గణేష్ మాస్టర్ ఎక్కువ ఎమోషనల్ అవ్వగా శేఖర్ మాస్టర్ కంట్రోల్ చేసారు. ఇద్దరూ స్టేజిపై హత్తుకొని ఎమోషనల్ అయ్యారు. దీంతో ఈ ఢీ ప్రోమో వైరల్ గా మారింది. ఫుల్ ఎపిసోడ్ కోసం వచ్చే వారం వరకు ఆగాల్సిందే. మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..