Selvaraghavan 7G Brindavan Colony sequel shooting starts from june
7G Brindavan Colony : ప్రముఖ నిర్మాత ఎ ఎం రత్నం కొడుకు రవి కృష్ణ (Ravi Krishna) హీరోగా పరిచయం అవుతూ నటించిన సినిమా 7G బృందావన్ కాలనీ. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. 2004 లో తమిళ చిత్రంగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి సక్సెస్ ని అందుకుంది. నెల గ్యాప్ తరువాత తెలుగులో కూడా రిలీజ్ చేయగా, ఇక్కడ కూడా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి యూత్ లో కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది.
Akhil Akkineni : నాన్న పై ఆధారపడడం ఇష్టం లేదు.. అన్నయ్య, నేను మాట్లాడుకుంటాం!
సోనియా అగర్వాల్ (Sonia Agarwal) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా సీనియర్ నటుడు చంద్రమోహన్ హీరో తండ్రి పాత్రలో కనిపించాడు. రవి కృష్ణ, చంద్రమోహన్ మధ్య చూపించిన ఫాదర్ అండ్ సన్ రేలషన్ మిడిల్ క్లాస్ కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని పాటలు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి సంగీతం అందించాడు. మూవీలోని ప్రతి పాట సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికి ఈ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ఫేవరెట్ ప్లే లిస్ట్ లో ఉంటాయి.
Tollywood : ఇండియన్ సినిమాకి పాన్ గ్లోబల్ ఇమేజ్ తెచ్చింది టాలీవుడ్.. నేపాలీ సూపర్ స్టార్!
కాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీసుకు రాబోతున్నారు మేకర్స్. సెల్వరాఘవన్ ఇటీవల ‘నేనే వస్తున్నా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. తన తదుపరి సినిమాగా 7G బృందావన్ కాలనీ సీక్వెల్ ని పట్టాలు ఎక్కిస్తున్నాడట. ఫస్ట్ పార్ట్ లో హీరోగా కనిపించిన రవి కృష్ణ.. ఈ సీక్వెల్ లో కూడా మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ చనిపోవడంతో సెకండ్ పార్ట్ లో మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎ ఎం రత్నం నిర్మాణంలో యువన్ శంకర్ రాజా మ్యూజికల్ లో ఈ సీక్వెల్ రాబోతుంది. జూన్ నుంచి ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది.