Simran: అక్కడ గౌరవం ఉండదు.. అంతా బేరాలే.. బాలీవుడ్‌ పరువు తీసిన సిమ్రాన్‌

బాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ బ్యూటీ సిమ్రాన్(Simran).

Senior Actress Simran Makes Shocking Comments About Bollywood

  • బాలీవుడ్ వివక్షపై సిమ్రాన్ ఫైర్.
  • నటీనటులకు అక్కడ గౌరవం లేదు.
  • హిందీ అవకాశాలు అందుకే వదులుకున్నా.

Simran: ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. దశాబ్ద కాలం పాటు సౌత్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్నారు. తన అద్భుతమైన నటనతోనే కాకుండా, ‘మెరుపు తీగ’ లాంటి డ్యాన్స్‌తో కుర్రకారు మనసు గెలుచుకున్న ఆమె, సీనియర్ స్టార్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన లెగసీని సృష్టించుకున్నారు. దక్షిణాదిలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ సీనియర్ నటి, తాజాగా బాలీవుడ్ పనితీరుపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె హిందీ చిత్ర పరిశ్రమలో ఉండే ఆ చులకన భావం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Srinidhi Shetty: ఆదియోగి సన్నిధిలో కేజీఎఫ్ బ్యూటీ.. ఆధ్యాత్మిక ముద్రలో శ్రీనిధి శెట్టి.. ఫొటోలు వైరల్

బాలీవుడ్ మేకర్స్ దక్షిణాది నటీనటుల పట్ల చూపే చిన్నచూపును సిమ్రాన్(Simran) తీవ్రంగా తప్పుపట్టారు. తమకు ఇక్కడ ఉన్న పేరును, ఫేమ్ ను అస్సలు గుర్తించరని, ఏదో ఇప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారిలా తమతో వ్యవహరిస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ కనీస గౌరవం దక్కదని, తమపై ఆధిక్యం ప్రదర్శించాలని చూడటం నచ్చకే తాను హిందీ సినిమాలకు దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. సరైన కమ్యూనికేషన్ లేకపోవడమే కాకుండా, దక్షిణాది స్టార్స్ పట్ల వారు అనుసరించే ధోరణి తన మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని ఆమె సూటిగా పేర్కొన్నారు.

షూటింగ్ సమయంలో వసతుల విషయంలోనూ బాలీవుడ్ వారు రాజీ పడమంటారని సిమ్రాన్ వెల్లడించారు. హోటల్ గదులు, విమాన టిక్కెట్ల దగ్గర నుంచి స్టాఫ్ ఖర్చుల వరకు ప్రతి విషయంలోనూ బేరాలు ఆడతారని, అది ఒక నటిగా తనకు ఎంతో ఇబ్బందిగా అనిపించేదని తెలిపారు. ఇవన్నీ చిన్న విషయాలుగా అనిపించినా, వృత్తిపరమైన గౌరవాన్ని తగ్గించేలా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమాలే ప్రాణంగా భావించే తమలాంటి వారిని తక్కువ చేసి చూడటం వల్లే, బాలీవుడ్ నుంచి ఎన్ని అవకాశాలు వచ్చినా సున్నితంగా తిరస్కరించానని సిమ్రాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి సిమ్రాన్ చేసిన ఈ కామెంట్స్ కి బాలీవుడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి.