Srinidhi Shetty: ఆదియోగి సన్నిధిలో కేజీఎఫ్ బ్యూటీ.. ఆధ్యాత్మిక ముద్రలో శ్రీనిధి శెట్టి.. ఫొటోలు వైరల్
కేజీఎఫ్ సెన్సేషన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) ఆధ్యాత్మిక బాట పట్టారు. కోయంబత్తూర్లోని ఈషా యోగా సెంటర్లో ధ్యానం చేస్తూ, ప్రశాంతమైన వాతావరణంలో గడిపిన అద్భుతమైన క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆదియోగి సన్నిధిలో ఆమె పొందిన ఈ ప్రశాంతత ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీనిధిలోని ఈ కొత్త కోణాన్ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు.




















