Visweswara Rao : సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. కమెడియన్ విశ్వేశ్వర రావు మరణం..

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న కమెడియన్ విశ్వేశ్వర రావు..

senior comedian Visweswara Rao is passed away

Visweswara Rao : సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే తమిళ్ స్టార్ నటుడు ‘డేనియల్ బాలాజీ’ మరణ వార్త అందర్నీ షాక్ కి గురి చేయగా.. నిన్న (ఏప్రిల్ 1) రాత్రి సీనియర్ స్టార్ రచయిత శ్రీ రామకృష్ణ మరణ వార్త అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. తాజాగా మరో నటుడి మరణ వార్త బయటకి వచ్చింది. ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వర రావు మరణించినట్లు సమాచారం.

కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వేశ్వర రావు నేడు తుది శ్వాస విడిచారట. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్థం కోసం తమిళనాడులోని సిరుశేరిలోని ఆయన వివాసంలోనే ఉంచినట్లు సమాచారం, రేపు బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారట. కాగా విశ్వేశ్వర రావు చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసారు. ఆరేళ్ల వయసులోనే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన విశ్వేశ్వర రావు.. బాలనటుడిగా 150కి పైగా చిత్రాల్లో నటించారు.

Also read : Yadamma Raju : జబర్దస్త్ నటుడు యాదమ్మ రాజు అరెస్ట్.. నాల్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ.. అసలేమైంది..!

ఆ తరువాత కమెడియన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో చేసారు. తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన విశ్వేశ్వర రావు కమెడియన్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు . ఇక ఈయన మరణ వార్త తెలియడంతో ఇండస్ట్రీ వర్గ ప్రముఖులు, ఆడియన్స్ సంతాపం తెలియజేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు