Yadamma Raju : జబర్దస్త్ నటుడు యాదమ్మ రాజు అరెస్ట్.. నాల్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ.. అసలేమైంది..!
యాదమ్మ రాజు అరెస్ట్ అయ్యాడా..? నాల్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసిన పోలీసులు. అసలేమైంది..!

Jabardasth actor Yadamma Raju is arrested news gone viral
Yadamma Raju : పటాస్, జబర్దస్త్ షోలతో కమెడియన్ గా తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్న నటుడు యాదమ్మ రాజు.. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలు చేస్తూ వస్తున్నారు. కాగా తాజాగా ఈ నటుడిని రాజకొండ కమీషనరేట్ పరిధిలోని బీబీనగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా నాల్ బెయిలబుల్ వారెంట్ పై అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
Also read : NTR : కొత్త కారు కొన్న ఎన్టీఆర్.. ఆ కారు విలువ ఎంతో తెలుసా..
యాదమ్మ రాజుని మరియు అతని స్నేహితుడు హరిని పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల కస్టడీకి తరలించారట. అయితే ఇదంతా ఓ సినిమా ప్రమోషన్ కోసమని తెలుస్తుంది. ప్రస్తుతం యాదమ్మ రాజు ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగానే ఈ న్యూస్ ని వైరల్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ వార్తల్లో ఏం రాసుకొచ్చిన విషయం ఏంటంటే.. తన ఆస్తిని తాను సాధించుకోవడం కోసం యాదమ్మ రాజు తన స్నేహితుడితో వెంట్రుకలను సేకరిస్తున్నాడట.
ఈ పాయింట్ సినిమా స్టోరీ లైన్ తెలుస్తుంది. దీని గురించి వివరాలను త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అందరికి తెలియజేయనున్నారు. మరి ఇది సినిమా ప్రమోషన్..? లేదా మరి ఇంకేమైనా విషయమా..? అనేది తెలియాలంటే వేచి చూడాలి.