Senior producer suryanarayana passes away
Surya Narayana : ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సినీ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారు. తాజాగా మరో సీనియర్ నిర్మాత కన్నుమూశారు. సీనియర్ ఎన్టీఆర్ కి అడవి రాముడు లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన నిర్మాత సూర్య నారాయణ 84 ఏళ్ళ వయసులో అనారోగ్య సమస్యలతో మరణించారు.
కోనసీమకు చెందిన సూర్యనారాయణ, తన బంధువు అయిన సత్యనారాయణతో కలిసి సత్య చిత్ర ప్రొడక్షన్స్ స్థాపించి సినిమాలు నిర్మించారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు నిర్మించారు. తాసిల్దారు గారి అమ్మాయి, ప్రేమబంధం, కుమారరాజా, కొత్తపేట రౌడీ, ఏది ధర్మం ఏది న్యాయం?, ఉద్ధండుడు, భలే తమ్ముడు, పవిత్ర ప్రేమ, అడవి రాముడు, కొత్త అల్లుడు.. లాంటి ఎన్నో సినిమాలని నిర్మించారు. హిందీలో అమితాబ్ తో మహాన్ అనే సినిమాని కూడా నిర్మించారు. సత్యనారాయణ మరణించినా సూర్యనారాయణ మాత్రం కొన్ని సంవత్సరాలు సినిమాలు తీస్తూ వచ్చారు.
Sankranthi Movies : సంక్రాంతి.. రొటీన్ సినిమాలు కావొచ్చు.. కానీ హిట్ కొట్టి కోట్లు రాబడుతున్నాయి..
అనంతరం వయోభారంతో సినిమాలకి దూరమైన ఆయన తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సూర్యనారాయణ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. శనివారం నాడు ఫిలిం నగర్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. సూర్యనారాయణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియచేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.