కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన సీనియర్ నటి శివపార్వతి ఇటీవల కరోనా బారిన పడ్డారు. కొద్దికాలంగా ఆమె సీరియల్స్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘వదినమ్మ’ సీరియల్‌లో కీలక పాత్రలో నటిస్తున్న శివపార్వతి కరోనా వైరస్ కారణంగా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. పరిస్థితి క్రిటికల్ అయ్యింది. చివరకు డాక్టర్స్ సహాయంతో ఆమె బ్రతికారు. తనకు కరోనా వైరస్ సోకడం, తాను ఎదుర్కొన్న మానసిక పరిస్థితి ఇబ్బందులు గురించి శివ పార్వతి ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
ఎంత పెద్ద ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్ అయినా ఆపద ఒకటే, ప్రాణం ఒకటే. ఆర్టిస్టులుగా మనం కలిసి పనిచేస్తున్నప్పుడు అనుబంధం ఉండాలి. కానీ.. నా గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇది దురదృష్టం. ఎవరి సమస్య వారిది. ఎవరికీ ఎవరూ తోడుండరు. ప్రభాకర్‌గారి నుండి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. మనుషుల మధ్య సంబంధాలు కృతకంగా అయిపోయాయి. నేను ఐదేళ్ల నుండి సినిమాలు చేయకపోయినా జీవిత రాజశేఖర్‌గారు హాస్పిటల్‌కు వచ్చారు. నా పరిస్థితి తెలుసుకుని అక్కడ డాక్టర్స్‌తో మాట్లాడారు. చాలా విషయాల్లో సపోర్ట్ చేసి నన్ను బయటకు తీసుకువచ్చారు.