Shah Rukh Khan : కథ నచ్చి కాదు.. మరో కారణంతో ‘జవాన్’ని షారుఖ్ ఒకే చేశాడట..
షారుఖ్ ఖాన్ కి జవాన్ మూవీ స్టోరీ బాగా నచ్చడం, లేక సౌత్ లో తన మార్కెట్ ని పెంచుకోవడానికి ఒకే చెప్పేలేదట. అసలు కారణం మరొకటి ఉందట.
- gum 95921
- Published On : September 7, 2023 / 04:39 PM IST
Shah Rukh Khan accept Jawan script for his kids Aryan Suhana
Shah Rukh Khan : బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ (Jawan) సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాగా అన్ని చోట్ల నుంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాని షారుఖ్ తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇక రీసెంట్ గా తనకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పఠాన్ సినిమాకంటే షారుఖ్ ఈ మూవీ పై కొంత ఎక్కువ ప్రేమనే చూపించాడనే చెప్పాలి.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్.. పవన్ అభిమానులకు పండగే..!
అయితే ఇందుకు కారణం మూవీ స్టోరీ బాగా నచ్చడం, లేక సౌత్ లో తన మార్కెట్ ని పెంచుకోవడానికి ప్రయత్నమో కాదు. అసలు కారణం మరొకటి ఉందట. ఈ మూవీ ఒకే చేయడానికి గల మొదటి కారణం తన పిల్లలు ఆర్యన్, సుహాన అని తెలుస్తుంది. తన తండ్రిని కూల్‌గా, యాక్షన్ ఎలివేటెడ్ అండ్ సూపర్ హీరో వంటి పాత్రలో చూడాలని ఇద్దరు పిల్లలు ఎప్పుడు అడుగుతుంటారట. ఇక అట్లీ ఈ కథ చెప్పినప్పుడు ఆర్యన్, సుహాన అడిగిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ జవాన్ లో కనిపించాయట.
Naa Saami Ranga : నాగార్జున సినిమాలో అల్లరి నరేష్.. స్నేహితుడు పాత్ర కోసమేనా..?
ఈ కారణంతోనే షారుఖ్ ముందుగా ఆ కథకి ఒకే చెప్పాడట. అలాగే కథ కూడా తనకి ఒక కొత్త అనుభూతుని కూడా ఇవ్వడం మరో కారణం. ఇక కథకి అనుగుణంగా షారుఖ్ ఈ సినిమాలో డిఫరెంట డిఫరెంట్ లుక్స్ లో కనిపించి ఆడియన్స్ కి కొత్త ఫీలింగ్ ఇచ్చాడు. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్.. ఆడియన్స్ కి నిజంగానే ఒక సూపర్ హీరో ఫిలిం చూసిన అనుభూతుని కలగజేస్తున్నాయని చెబుతున్నారు. ఇక ప్రీ బుకింగ్స్ తోనే 100 కోట్ల కలెక్షన్స్ వచ్చేశాయి అని చెబుతున్నారు ట్రేడ్ పండితులు. అలాగే వెయ్యి కోట్ల మార్క్ ని కూడా ఈ మూవీ ఈజీగా అందుకుంటుందని చెబుతున్నారు.
