Shah Rukh Khan-Aryan Khan : తండ్రీ కొడుకుల విస్కీ బిజినెస్.. వరల్డ్ లోనే బెస్ట్ బ్రాండ్ గా.. రేటెంతో తెలుసా..

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో రికార్డ్స్ బ్రేక్ చేసాడు ఆయన.

Shah Rukh Khan and Aryan Khans whiskey business

Shah Rukh Khan-Aryan Khan : బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో రికార్డ్స్ బ్రేక్ చేసాడు ఆయన. ఇక తనలాగే తన కొడుకు కూడా సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. డైరెక్టర్ గా పరిచయమవుతూ.. నెట్‌ఫ్లిక్స్ లో సిరీస్‌ చేస్తున్నారు. ఈ సిరీస్ త్వరలోనే రాబోతుంది. అయితే కేవలం డైరెక్టర్ గానే కాకుండా 2022లో బిజినెస్ కూడా స్టార్ట్ చేసాడు. తన తండ్రితో కలిసి విస్కీ బ్రాండ్‌ను ప్రారంభించారు.

అయితే ఇప్పుడు ప్రపంచంలోని బెస్ట్ బ్రాండ్స్ లలో వీరి బ్రాండ్ ఒకటిగా మారింది. తండ్రీ కొడుకులిద్దరూ D’YAVOL Inception అనే విస్కీ బ్రాండ్‌ను నడుపుతున్నారు. ఆర్యన్‌తో కలిసి, అతను D’YAVOL సహ యజమానిగా ఉన్నాడు. అంతేకాదు ఇటీవల ఈ బ్రాండ్ 2024 న్యూయార్క్ వరల్డ్ స్పిరిట్స్ పోటీలో పలు గౌరవాలను కూడా పొందింది. బ్రాండ్ బెస్ట్ ఓవరాల్ స్కాచ్, బెస్ట్ ఆఫ్ క్లాస్, బెస్ట్ బ్లెండెడ్ మాల్ట్ స్కాచ్ విస్కీ అవార్డులను అందుకుంది.

Also Read : Sukumar : ‘సుక్కు స్వాగ్’.. సుకుమార్ పై రాప్ సాంగ్.. భలేఉందే..

అలానే న్యూయార్క్ వరల్డ్ స్పిరిట్స్ కాంపిటీషన్‌లో, విస్కీ నాణ్యత, తయారీతో సహా వివిధ వాటిలో అన్నిటిలో బాగున్నాయని తేలింది. కాగా ఈ అవార్డ్స్ పై ఆర్యన్ ఖాన్ స్పందించారు. “నిజాయితీ, నాణ్యత, నైపుణ్యం విషయంలో మేము సరైన దారిలోనే ఉన్నామని ఈ అవార్డు అందుకోవడంతో రుజువైంది” అని తెలిపాడు. ఇక ఈ విస్కీ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. కేవలం 750ml మహారాష్ట్రలో రూ. 9,800 కాగా గోవాలో రూ. 9,000. కర్ణాటకలో రూ. 9,500. పలు చోట్ల మాత్రమే ఈ బ్రాండ్ అందుబాటులో ఉండగా త్వరలోనే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణలలో అందుబాటులో వస్తుందని అంటున్నారు.