Jawan : జవాన్ ట్రైలర్‌లో చెప్పిన షారుఖ్ డైలాగ్‌ని.. ఆ విషయానికి లింక్ చేస్తున్న నెటిజెన్స్.. ఏంటది..?
జవాన్ ట్రైలర్ లో షారుఖ్ ఖాన్ చెప్పిన ఒక డైలాగ్ ఆ పోల్స్ అధికారికే అంటూ నెట్టింట వైరల్ అవుతుంది.
- gum 95921
- Published On : August 31, 2023 / 02:55 PM IST
Shah Rukh Khan dialogue in Jawan trailer is gone viral
Jawan : షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), నయనతార (Nayanathara), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘జవాన్’. ఈ మూవీ రిలీజ్ దగ్గర పడడంతో సాంగ్స్ అండ్ ట్రైలర్ కట్ వీడియోలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఒక ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ లోని ఒక డైలాగ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. “నా కొడుకు మీద చెయ్యి వేసే ముందు. వాడి బాబు మీద చెయ్యి వెయ్యి” అన్న డైలాగ్.
Gautam Ghattamaneni : గౌతమ్‌కి మహేష్, నమ్రతా, సితార బర్త్ డే విషెస్.. పోస్టులు వైరల్!
షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) డ్రగ్స్ విషయంలో జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ళు ఆర్యన్ జైలు జీవితాన్ని కూడా గడిపి బయటకు వచ్చాడు. ఇక ఈ విషయాన్ని నెటిజెన్స్ ఈ డైలాగ్ కి సింక్ చేస్తున్నారు. ఆ కేసులో ఆర్యన్ ఖాన్‌ని అరెస్ట్ చేసిన మాజీ యాంటీ డ్రగ్స్ అధికారి సమీర్ వాంఖడేకి షారుఖ్ డైరెక్ట్ మెసేజ్ ఇచ్చాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డైలాగ్ నెట్టింట పెద్ద హాట్ టాపిక్ అయ్యిపోయింది.
Drugs Case : మాదాపూర్ డ్రగ్స్ పార్టీ పై విచారణ వేగవంతం చేసిన పోలీసులు..
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. యాక్షన్, విజువల్స్ రెండు అదిరిపోయాయి. ఈ మూవీలో షారుఖ్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ప్రియమణి, సన్య, యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటిస్తుంటే దీపికా పదుకొనే అతిధి పాత్రలో కనిపించబోతుంది. షారుఖ్ తన సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మరి పఠాన్ ఇచ్చిన సక్సెస్ ని జవాన్ కంటిన్యూ చేస్తుందా..? లేదా షారుఖ్ స్పీడ్ కి బ్రేక్ వేస్తుందా..? అనేది చూడాలి.
