Shah Rukh Khan Pathaan Gets Shock From Censor Board
Pathaan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పఠాన్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని జనవరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది.
Pathaan Row: ఆవు హిందువులది, ఎద్దు ముస్లింలదా?.. బేషరం రంగ్ కాంట్రవర్సీపై ఫారూఖ్ అబ్దుల్లా ఫైర్
అయితే ఈ సినిమా పలు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచింది. ‘బేషరమ్’ సాంగ్‌లో ఆరెంజ్ డ్రెస్సుపై వివాదం చెలరేగడంతో, ఈ సినిమాపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు తాజాగా మరో షాక్ తగిలింది. తాజాగా పఠాన్ చిత్రం సెన్సార్ కోసం వెళ్లగా, సినిమాలో కొన్ని సీన్స్‌ను తొలగించాలని సెన్సార్ బోర్డు సూచించిందట. దీంతో ఈ సినిమాలోని వారు తెలిపిన సీన్స్‌ను తొలగించి, కొన్ని డైలాగులు మ్యూట్ చేసి మరోసారి రావాల్సిందిగా సెన్సార్ బోర్డు తెలిపిందట.
Pathaan: నాకు కనుక షారూఖ్ కనిపిస్తే అక్కడే దహనం చేస్తా.. అయోధ్య సాధువు క్రూర వ్యాఖ్యలు
దీంతో పఠాన్ మేకర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. అయితే సెన్సార్ బోర్డు సూచించినట్లుగా సినిమాలోని కొన్ని సీన్స్, డైలాగ్స్ తొలగించే పనిలో పఠాన్ చిత్ర యూనిట్ బిజీగా ఉందట. ఈ సినిమాలో అందాల భామ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోండగా, జాన్ అబ్రహాం మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ ప్రొడ్యూస్ చేస్తోంది.