Shah Rukh Khan said no to Guest Appearance in Lokesh Kanagaraj Rajinikanth Thalaivar 171 Movie
Thalaivar 171 : ప్రస్తుతం తమిళ్ లో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఫుల్ ఫామ్ లో వరుస హిట్స్ తో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే విజయ్ లియో సినిమాతో మంచి హిట్ కొట్టిన లోకేష్ ఆ తర్వాత రజినీకాంత్(Rajinikanth) తో సినిమా ప్రకటించాడు. తలైవర్ 171వ సినిమా లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ప్రస్తుతం లోకేష్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వినిపిస్తుంది. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) ని గెస్ట్ అప్పీరెన్స్ అడిగినట్టు సమాచారం. ఆల్రెడీ షారుఖ్ ని కలిసి కథ చెప్పగా షారుఖ్ కి కథ నచ్చినా ఇప్పటికే చాలా సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ చేశానని, ప్రస్తుతం సినిమాల మీదే ఫోకస్ చేస్తున్నాను అని, గెస్ట్ పాత్రలు ఇప్పట్లో చేయను అని చెప్పినట్టు తెలుస్తుంది.
Also Read : Bigg Boss 7 Final : బిగ్‌బాస్ ఫినాలే ప్రోమో చూశారా? రవితేజ గెస్ట్‌గా.. అమర్ దీప్‌కి నాగ్ బంపర్ ఆఫర్..
దీంతో లోకేష్ కనగరాజ్ మరో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్(Ranveer Singh) ని అప్రోచ్ అయ్యాడని బాలీవుడ్ సమాచారం. రణవీర్ పూర్తి కథ చెప్పమని అడిగినట్టు, లోకేష్ కూడా పూర్తి స్క్రిప్ట్ అయ్యాక మరోసారి రణవీర్ ని కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రణవీర్ ఓకే అంటే రజిని సినిమాలో రణవీర్ స్పెషల్ అప్పీరెన్స్ లోకేష్ దర్శకత్వంలో చూసేయొచ్చు. 2025లో ఈ సినిమా రావొచ్చు అని సమాచారం. ఇక రజినీకాంత్ ప్రస్తుతం TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 170వ సినిమా వేట్టయాన్ చేస్తున్నారు.