Jawan Movie: జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ పట్టుకున్న ఫోనుపై ఎందుకింత రచ్చ రచ్చ?
షారుక్ ఖాన్ ఈ సినిమాలో పోకో ఫోన్ వాడాడు. సాధారణంగా నటులు సినిమాల్లో వాడే డివైజ్‌లు...
- T Venkateshwarlu
- Updated on- September 8, 2023 / 05:42 PM IST
Jawan Movie - Shah Rukh
Jawan Movie – Shah Rukh: రియల్మీ (Realme) బ్రాండ్ ప్రచారకర్త, బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తన కొత్త సినిమా జవాన్‌లో పోకో ఫోన్ (Poco phone) పట్టుకుని ఓ సీన్లో కనపడ్డాడు. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలను నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.
పాపం రియల్ మీ అంటూ మీమ్స్ సృష్టిస్తున్నారు. జవాన్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రియల్ మీ, షావోమీ సబ్‌బ్రాండ్ పోకో రెండూ చైనా కంపెనీలే. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ రెండు కంపెనీలకు పోటీ ఉంది. షారుక్ ఖాన్ భారత్‌లో రియల్ మీ బ్రాండ్ ప్రచారకర్త అయినప్పటికీ, షావోమీ సబ్‌బ్రాండ్ పోకో జవాన్ నిర్మాతలతో ఒప్పందం ఉంది.
అందుకే షారుక్ ఖాన్ ఈ సినిమాలో పోకో ఫోన్ వాడాడు. సాధారణంగా నటులు సినిమాల్లో వాడే డివైజ్‌లు ప్రొడక్షన్ హౌసెస్ ఒప్పందంలో బాగంగానే వాడతారు. షారుక్ ఖాన్ ఈ ఏడాది మే నుంచి రియల్ మీ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఉంటున్నాడు. ఈ విషయాన్ని ఆ సమయంలోనే షారుక్ ట్విట్టర్ లో తెలిపాడు.
సినిమాలో ఆయన వాడిన పోకో ఫోన్ తో మాత్రం జవాన్ సినిమా నిర్మాతలకు ఒప్పందం ఉంది. సినిమాలో షారుక్ వాడిన వాడిన ఫోన్ పోకో ఎక్స్4 ప్రో అని కొందరు అభిమానులు గుర్తించారు. ఈ ఫోన్ మార్కెట్లోకి 2022 ఏప్రిల్‌లో విడుదలైంది.
Chandramukhi 2: వినాయక చవితి వేళ ‘చంద్రముఖి-2’ని చూసే అదృష్టం ఇక లేనట్లే..
