Shahrukh Khan : మొదటిసారి తిరుమలకు షారుఖ్ ఖాన్.. కూతురు సుహానా, నయనతారతో కలిసి.. జవాన్ ప్రమోషన్స్..
నేడు ఉదయం షారుఖ్ ఖాన్, నయనతార, మరికొంతమంది చిత్రయూనిట్ తో కలిసి తిరుమలకు(Tirumala) వచ్చి వేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నారు.
- Saketh U
- Updated on- September 5, 2023 / 07:43 AM IST
Shahrukh Khan first time visited Tirumala Sri Venkateswara Swami Temple for Jawan Promotions with Movie Unit
Shahrukh Khan : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్ త్వరలో జవాన్(Jawan) సినిమాతో రాబోతున్నాడు. సెప్టెంబర్ 7న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇందులో నయనతార(Nayanathara) హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్ గా నటించారు. ప్రియమణి, దీపికా పదుకొనే.. మరికొంతమంది స్టార్స్ ముఖ్య పాత్రలు చేశారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా తెరకెక్కగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఇప్పటికే జవాన్ చిత్రయూనిట్ ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైకు రాగా నేడు ఉదయం షారుఖ్ ఖాన్, నయనతార, మరికొంతమంది చిత్రయూనిట్ తో కలిసి తిరుమలకు(Tirumala) వచ్చి వేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నారు. షారుఖ్ ఖాన్ తన లైఫ్ లో తిరుమలకు రావడం ఇదే మొదటిసారి. సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు జవాన్ చిత్రం టీం.
షారుఖ్ ఖాన్ తో పాటు కూతురు సుహానా ఖాన్, జవాన్ టీం, నయనతార భర్త దర్శకుడు విగ్నేష్ శివన్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో మొదటిసారి షారుఖ్ ఖాన్ తిరుమలకు రావడంతో ఆలయంలోకి నడిచి వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
