Aryan Khan : షారుఖ్ తనయుడి ఎంట్రీ ఫిక్స్.. అఫీషియల్ ప్రకటన ఇచ్చేసిన నిర్మాణ సంస్థ..
బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ తనయుడు అతి త్వరలో బాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. ఆర్యన్ ఖానే స్వయంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. తండ్రి షారుఖ్ తరహాలో.............
- Saketh U
- Updated on- May 29, 2023 / 11:17 AM IST
Shahrukh Khan son Aryan Khan ready to entry in Bollywood
Aryan Khan : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ కేసులో జైలుకెళ్ళొచ్చి వార్తల్లో ట్రెండింగ్ గా నిలిచాడు. ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇద్దామనుకునే సమయంలో ఇలా జరగడంతో కొన్ని రోజులు ఆర్యన్ ఖాన్ సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఆర్యన్ బాలీవుడ్ డెబ్యూకి సమయం ఆసన్నమైంది. షారుఖ్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ అతడి అరంగేంట్రానికి వేదికగా మారింది.
బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ తనయుడు అతి త్వరలో బాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. ఆర్యన్ ఖానే స్వయంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. తండ్రి షారుఖ్ తరహాలో అతడు హీరోగా సిల్వర్ స్క్రీన్ మీదకు రావడం లేదు. ప్రస్తుతానికి తెర వెనుక ఉంటున్నాడు. నటుడిగా కాకుండా రచయితగా, దర్శకుడిగా బాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అవుతుండడం టాక్ ఆఫ్ బాలీవుడ్ అయింది.
ఆర్యన్ ఖాన్ ను బాలీవుడ్ లో హీరోగా పరిచయం చేయడానికి కరణ్ జోహార్ రెండు సార్లు ట్రై చేశాడు. అయితే ఆర్యన్ మనసు మాత్రం మార్చలేకపోయాడు. తనకి రైటర్ గా ఇంట్రడ్యూస్ అవడమే ఇష్టమంటూ కుండబద్దలు కొట్టేశాడు. దాంతో ఆర్యన్ ఖాన్ అభిరుచికి తగ్గట్టు అతడ్ని రైటర్ గానే ప్రోత్సహించారు షారుఖ్ దంపతులు. ఆర్యన్ రైటర్ గా తన బాలీవుడ్ డెబ్యూ గురించి సోషల్ మీడియాలో అఫీషియల్ గా ప్రకటించడం ఆసక్తిగా మారింది.
Rush Hour : సూపర్ హిట్ హాలీవుడ్ మల్టీస్టారర్ సినిమాకి.. మరో సీక్వెల్ రెడీ అంటున్న జాకీచాన్..
తండ్రి షారుఖ్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఆర్యన్ తొలి ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ రాయడం పూర్తి అయ్యిందని తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తాను రాసిన స్క్రిప్ట్ నోట్ బుక్ షేర్ చేసిన ఆర్యన్ ”రైటింగ్ కంప్లీట్ అయ్యింది… త్వరలో యాక్షన్ చెప్పాలని ఎదురు చూస్తున్నాను” అని రాశాడు. మొత్తానికి బాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు అందరి వారసులకు భిన్నంగా రైటర్, డైరెక్టర్ అవడం ఇంట్రెస్టింగ్ పాయింటే. మరి ఆర్యన్ ఏ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కొడతాడో చూడాలి.
