Rush Hour : సూపర్ హిట్ హాలీవుడ్ మల్టీస్టారర్ సినిమాకి.. మరో సీక్వెల్ రెడీ అంటున్న జాకీచాన్..

హాలీవుడ్ లో జాకీచాన్ మరో నటుడు క్రిస్ టక్కర్ తో కలిసి తీసిన రష్ అవర్ సినిమా భారీ విజయం సాధించింది. డిటెక్టివ్, కామెడీ, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మొదట 1998లో రిలీజయింది. అనంతరం దీనికి సీక్వెల్ గా....................

Rush Hour : సూపర్ హిట్ హాలీవుడ్ మల్టీస్టారర్ సినిమాకి.. మరో సీక్వెల్ రెడీ అంటున్న జాకీచాన్..

Rush Hour sequel announced by jackie chan

Rush Hour : హాంగ్ కాంగ్ స్టార్ హీరో జాకీచాన్ తన సినిమాలతో హాలీవుడ్ లో కూడా స్టార్ హీరో అయ్యాడు. కామెడీ, యాక్షన్ నేపథ్యంలో జాకీచాన్ సినిమాలు ఎక్కువగా ఉంటాయి. హాంగ్ కాంగ్ లో స్టార్ అయిన అనంతరం హాలీవుడ్ మీద కూడా ఫోకస్ చేసి తన సినిమాలని అక్కడ కూడా రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు. అనంతరం హాలీవుడ్ లోనూ సినిమాలు తీసాడు జాకీచాన్.

హాలీవుడ్ లో జాకీచాన్ మరో నటుడు క్రిస్ టక్కర్ తో కలిసి తీసిన రష్ అవర్ సినిమా భారీ విజయం సాధించింది. డిటెక్టివ్, కామెడీ, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మొదట 1998లో రిలీజయింది. అనంతరం దీనికి సీక్వెల్ గా పార్ట్ రష్ అవర్ 2 సినిమా 2001 లో రిలీజయి మంచి విజయం సాధించింది. అనంతరం మరో సీక్వెల్ రష్ అవర్ 3 సినిమా 2007 లో రిలీజయి అది కూడా హాలీవుడ్ లో భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాకి మరో సీక్వెల్ వస్తుందని చాలా మంది అనుకున్నారు. జాకీచాన్ అభిమానులు కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఆశించారు.

Radhika Pandit : నా జీవితాన్ని అద్భుతంగా మార్చావు.. KGF స్టార్ యష్ భార్య ఎమోషనల్ పోస్ట్..

తాజాగా 15 సంవత్సరాల తర్వాత రష్ అవర్ 4ని రెడీ చేస్తున్నట్టు జాకీచాన్ ప్రకటించాడు. ఇటీవల రెడ్ సి ఫిలిం ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో పాల్గొన్న జాకీచాన్.. ప్రస్తుతం రష్ అవర్ 4 కథ రెడీ చేస్తున్నాం. త్వరలోనే దర్శకుడిని కలుస్తాను. క్రిస్ టక్కర్ తో కలిసి రష్ అవర్ 4 ఉంటుంది త్వరలో అని తెలిపాడు. మరోసారి జాకీచాన్, క్రిస్ టక్కర్ కలిసి సందడి చేయనుండటంతో రష్ అవర్ సినిమా అభిమానులు, జాకీచాన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.