Radhika Pandit : నా జీవితాన్ని అద్భుతంగా మార్చావు.. KGF స్టార్ యష్ భార్య ఎమోషనల్ పోస్ట్..

యష్ భార్య రాధిక పండిట్ కూడా ఒకప్పుడు హీరోయిన్. రాధిక గతంలో కన్నడలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. యష్ తో కలిసి ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది రాధిక. అప్పటి నుంచి................

Radhika Pandit : నా జీవితాన్ని అద్భుతంగా మార్చావు.. KGF స్టార్ యష్ భార్య ఎమోషనల్ పోస్ట్..

KGF Hero Yash wife Radhika Pandit shares emotional post

Updated On : December 10, 2022 / 7:23 AM IST

Radhika Pandit :  కన్నడ స్టార్ హీరో యష్ KGF సినిమాలతో దేశమంతటా స్టార్ అయిపోయాడు. యష్ ని ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని పెంచాడు యష్. KGF సినిమా తర్వాత ఇంకా ఏ ప్రాజెక్టు ఓకే చేయకుండా ప్రస్తుతం కథలు వింటున్నాడు. డిసెంబర్ 9 శుక్రవారం నాడు యష్ తన వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.

యష్ భార్య రాధిక పండిట్ కూడా ఒకప్పుడు హీరోయిన్. రాధిక గతంలో కన్నడలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. యష్ తో కలిసి ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది రాధిక. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం మొదలై తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ 9, 2016న యష్, రాధిక పండిట్ వివాహం చేసుకున్నారు. వీళ్లకీ ఒక బాబు, ఒక పాప కుడా ఉన్నారు. వీరి వివాహం జరిగి ఆరేళ్ళు పూర్తయిన సందర్భంగా యష్ భార్య రాధిక తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Jabadasth Faima : బిగ్‌బాస్ వెళ్లొచ్చినందుకు ఫైమాకి గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చిన జబర్దస్త్ నటుడు..

యష్ తో ప్రేమగా ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ.. ”ఇదే మనం. మనం సినిమా కావొచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు, మనం సీరియస్ గా ఉండొచ్చు కానీ మనం అనేది నిజం. ఈ ఆరేళ్లలో నా వైవాహిక జీవితాన్ని ఇంత అద్భుతంగా మార్చినందుకు చాలా థ్యాంక్స్. హ్యాపీ యానివర్సరీ. లవ్ యు” అంటూ పోస్ట్ చేసింది. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు కూడా వీరికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.