‘హౌస్‌ఫుల్ 4’ నుండి ‘సైతాన్ కా సాలా’ వీడియో సాంగ్ విడుదల.. సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..
‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలో వస్తున్న ‘హౌస్‌ఫుల్ 4’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్.. ఫర్హాద్ సామ్‌జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను.. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో, నడియాడ్ వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నాడు.
పునర్జన్మల నేసథ్యంలో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్స్‌కి, ట్రైలర్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో మూవీ ప్రమోషన్స్ నిర్వహించిన మూవీ టీమ్.. ఈ సందర్భంగా సినిమాలోని ‘సైతాన్ కా సాలా’ వీడియో సాంగ్ విడుదల చేశారు. సోహైల్ సేన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, దర్శకుడు ఫర్హాద్ సామ్‌జీ లిరిక్స్ రాశారు. సోహైల్ సేన్, విశాల్ కలిసి పాడారు..
Read Also : నితిన్ ‘రంగ్‌దే!’ – ప్రారంభం..
గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు. పెద్దసంఖ్యలో డ్యాన్సర్లతో ఈ సాంగ్‌ను భారీగా పిక్చరైజ్ చేశారు. అమంద రోసారియో, చుంకీ పాండే, బొమన్ ఇరానీ, జానీ లివర్, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, ప్రదీప్ రావత్, సౌరభ్ శుక్లా, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటించిన ‘హౌస్‌ఫుల్ 4’.. అక్టోబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.