Sharwanand : బాలయ్య బాబు టైటిల్‌తో శర్వానంద్ సినిమా.. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందే..

శర్వానంద్ 37వ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, మరో వైపు శర్వా తండ్రి పాత్రలో కూడా కనిపిస్తాడని ఇప్పటికే టాక్ నడుస్తుంది. తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమాకి బాలయ్య బాబు పాత సినిమా టైటిల్ పెడతారని వినిపిస్తుంది.

Sharwanand : శర్వానంద్ ఇటీవల తన పుట్టిన రోజు నాడు వరుసగా మూడు సినిమాల అప్డేట్స్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ‘మనమే’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత శర్వానంద్ 36, శర్వానంద్ 37 సినిమాలు ఉన్నాయి. శర్వా 37వ సినిమా ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో, AK ఎంటర్టైన్మెంట్ లో తెరకెక్కబోతుంది.

శర్వానంద్ 37వ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, మరో వైపు శర్వా తండ్రి పాత్రలో కూడా కనిపిస్తాడని ఇప్పటికే టాక్ నడుస్తుంది. తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమాకి బాలయ్య బాబు పాత సినిమా టైటిల్ పెడతారని వినిపిస్తుంది. గతంలో బాలకృష్ణ(Balakrishna) ఇద్దరు హీరోయిన్స్ తో ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఇద్ద్దరు భామల మధ్య నలిగిపోయిన హీరోలా బాలయ్య కామెడీతో నవ్వించి ఎమోషన్ కూడా పండించాడు. ఇప్పుడు అదే టైటిల్ ని శర్వానంద్ సినిమాకు పెట్టబోతున్నట్టు సమాచారం.

Also Read : Anasuya : ఒరే బాబు.. నేను జనసేనకు ప్రచారం చేస్తానని చెప్పలేదు.. నేనేం మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తున్నారు..

శర్వానంద్ 37వ సినిమాకి దర్శకుడు రామ్ అబ్బరాజు నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా ఉండబోతున్నారని సమాచారం. ఆల్రెడీ రామ్ అబ్బరాజు శ్రీవిష్ణుతో ‘సామజవరగమన’ సినిమాతో హిలేరియస్ గా నవ్వించి హిట్ కొట్టాడు. మరి ఇప్పుడు శర్వాతో కూడా నారీ నారీ నడుమ మురారి అని నవ్విస్తాడేమో చూడాలి. అధికారికంగా ఈ టైటిల్ ని ఎప్పుడు ప్రకటిస్తారో మరి.

ట్రెండింగ్ వార్తలు