నేను జనసేనకు ప్రచారం చేస్తానని చెప్పలేదు.. నేనేం మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తున్నారు..

అనసూయ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా.. అనసూయ పవన్ కళ్యాణ్ కి, జనసేనకు ప్రచారం చేస్తుందని వార్తలు వచ్చాయి.

నేను జనసేనకు ప్రచారం చేస్తానని చెప్పలేదు.. నేనేం మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తున్నారు..

Anasuya Gives Clarity On Election Campaign for Janasena Comments goes Viral

Anasuya : యాంకర్, నటి అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. వరుసగా సినిమాలు చేస్తూ కొత్త కొత్త క్యారెక్టర్స్ తో మెప్పిస్తుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం అనసూయ రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటుంది. తన ఫొటోలతోనో, తన కామెంట్స్, తన ట్వీట్స్ తో అనసూయ వైరల్ అవుతూ ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాలిటిక్స్ గురించి, నాగబాబు, రోజా అడగడంతో.. నేను పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారు, నాగబాబు గారు పిలిస్తే కచ్చితంగా ప్రచారం చేస్తాను, అలాగే రోజా(Roja) మేడమ్ గారు పిలిచినా ప్రచారం చేస్తాను. నేను పార్టీలను చూడను, వ్యక్తులని చూస్తాను అని అనసూయ చెప్పుకొచ్చారు.

దీంతో అనసూయ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా.. అనసూయ పవన్ కళ్యాణ్ కి, జనసేనకు(Janasena) ప్రచారం చేస్తుందని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు కూడా ఈ వ్యాఖ్యలని బాగా ప్రమోట్ చేసారు. దీంతో కొంతమంది అనసూయని రాజకీయాల గురించి మాట్లాడుతూ ట్రోల్ చేసారు. తాజాగా అనసూయ ఓ షాప్ ఓపెనింగ్ లో పాల్గొనగా అక్కడ మీడియాతో మాట్లాడింది. మీడియా ప్రతినిధులు జనసేనకు ప్రచారం చేస్తున్నారంట అని అడగడంతో దీనిపై క్లారిటీ ఇచ్చింది అనసూయ.

Also Read : Tillu Square Twitter Review : ‘టిల్లు స్క్వేర్’ ట్విట్టర్ రివ్యూ.. డీజే టిల్లు మళ్ళీ హంగామా చేశాడా? ప్రేక్షకులు ఏమంటున్నారు?

అనసూయ మాట్లాడుతూ.. ”నేను తుమ్మినా, దగ్గినా , ఏం మాట్లాడినా వివాదం చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో నన్ను పాలిటిక్స్ గురించి అడిగితే, దానికి తగ్గట్టు సమాధానం చెప్పాను. అంతేకాని నేను జనసేనకు నా అంతట నేను ప్రచారం చేస్తానని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ మంచి లీడర్. ఆయన అడిగితే సపోర్ట్ చేస్తాను అని చెప్పాను కానీ నా అంతట నేను పార్టీకి ప్రచారం చేస్తాననలేదు. నేను ఏ ఒక్క పార్టీ గురించి చెప్పలేదు. జనసేనకు మంచి అజెండా ఉంది. ప్రతి పార్టీలోనూ కొన్ని మంచి అజెండాలు ఉంటాయి. మంచి లీడర్స్ అడిగితే వాళ్ళు ఏ పార్టీ అయినా నేను సపోర్ట్ చేస్తాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి” అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో మరోసారి అనసూయ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.