Sharwanand : శర్వానంద్ తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన డైరెక్టర్.. సాయి ధరమ్ తేజ్ సినిమా ఆగిపోయిందా.. ?

తాజాగా శర్వానంద్ తన 38వ సినిమాని ప్రకటించాడు.

Sharwanand 38 Movie Announced under Samapath Nandi Direction

Sharwanand : శర్వానంద్ ఇటీవల వరుస సినిమాలను అనౌన్న్ చేస్తున్నాడు. ఇటీవలే మనమే సినిమాతో వచ్చి పర్వాలేదనిపించింది. శర్వా ఆ తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. తాజాగా శర్వానంద్ తన 38వ సినిమాని ప్రకటించాడు.

రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సీటిమార్.. లాంటి మాస్ సినిమాలతో అదరగొట్టిన డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నిర్మాణంలో రాధామోహన్ నిర్మాతగా శర్వానంద్ 38వ సినిమాని నేడు ప్రకటించారు. శర్వా సంపత్ బ్లడ్ ఫీస్ట్ అంటూ ఫుల్ మాస్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలిపారు. ఇక పోస్టర్ లో శర్వా 38 అని వేసి వాటర్ లో ఫైర్ ఉన్నట్టు మాస్ గా చూపించారు. దీంతో శర్వానంద్ 38 సినిమా ఫుల్ వైలెన్స్, రక్తపాతం ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

అయితే సంపత్ నంది ఇటీవల గంజా శంకర్ అని సాయి ధరమ్ తేజ్ తో సినిమా అనౌన్స్ చేసారు. ఆ సినిమాకు సంబంధించి చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. కానీ ఆ సినిమిమా ఆగిపోయిందని, బడ్జెట్ ఎక్కువై సినిమా ఆపేశారని వార్తలు వచ్చాయి. దానిపై ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేదు. ఆ సినిమాని పట్టించుకోకుండా ఇప్పుడు సంపత్ నంది తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయడంతో సాయి ధరమ్ తేజ్ తో సినిమా ఆగిపోయిందని ఫిక్స్ అయిపోతున్నారు టాలీవుడ్ జనాలు.