Unstoppable 2: బాలయ్య టాక్ షోకు మరో ఇద్దరు యంగ్ హీరోలు.. ఇక సందడే సందడి!
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షో, ఇప్పుడు మూడో ఎపిసోడ్‌కు రెడీ అయ్యింది. ఈసారి కూడా ఇద్దరు హీరోలను బాలయ్య టాక్ షోకు తీసుకొస్తున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది.
- Anil Aaleti
- Published On : October 30, 2022 / 04:43 PM IST
Sharwanand Adivi Sesh To Be Next Guests For Unstoppable 2 Show
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షో విజయవంతంగా దూసుకుపోతుంది. తొలి సీజన్‌లో బాలయ్య ఎనర్జీ, ఆయన తనదైన స్టైల్‌లో టాక్ షోను ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ కావడంతో.. నిర్వాహకులు ఇప్పుడు రెండో సీజన్‌ను కూడా స్టార్ట్ చేశారు. ఇక ఇప్పటికే రెండు ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షో, ఇప్పుడు మూడో ఎపిసోడ్‌కు రెడీ అయ్యింది.
Unstoppable 2: అందర్నీ నవ్వించిన డీజే టిల్లు.. బాలయ్యను మాత్రం ఏడిపించాడు..
అయితే తొలి ఎపిసోడ్‌కు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లు గెస్టులుగా రాగా, ఆ ఎపిసోడ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక రెండో ఎపిసోడ్‌లో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ గెస్టులుగా వచ్చి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావంతో, ఇప్పుడు మరోసారి ఇదే స్ట్రాటెజీని ఫాలో అవుతున్నారు అన్‌స్టాపబుల్ 2 నిర్వాహకులు. ఈసారి కూడా ఇద్దరు హీరోలను బాలయ్య టాక్ షోకు తీసుకొస్తున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది.
Unstoppable 2 : బావతో బాలయ్య సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటో!
అన్‌స్టాపబుల్ 2 టాక్ షో మూడో ఎపిసోడ్‌లో యంగ్ హీరో శర్వానంద్, అడివి శేష్‌లు గెస్టులుగా రాబోతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో వీరిద్దరితో బాలయ్య ఎలాంటి సందడి చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్‌ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా తెలిపింది.
And the dhabidi dhibidi continues with the two #MostEligibleBachelors of Tollywood, on India’s most rated talk show #UnstoppableWithNBKS2!
Episode 3 premieres November.#NandamuriBalakrishna #NBKOnAHA @AdiviSesh @ImSharwanand pic.twitter.com/ctfZeIVdXG
— ahavideoin (@ahavideoIN) October 30, 2022
