Sharwanand: శర్వానంద్ – శ్రీను వైట్ల క్రేజీ కాంబో.. ‘జార్జ్ కృష్ణ’గా మారనున్న యంగ్ హీరో

దర్శకుడు శ్రీను వైట్ల చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్(Sharwanand).

Sharwanand and Srinu Vaitla Movie George Krishna

  • శ్రీను వైట్ల కథకు ఒకే చెప్పిన శర్వానంద్
  • జార్జ్ కృష్ణ పేరుతో కొత్త సినిమా
  • త్వరలోనే రానున్న అధికారిక ప్రకటన

Sharwanand: టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా నారీ నారీ నడుమ మురారి సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం బైకర్, భోగి వంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.

ఈ క్రమంలోనే శర్వానంద్(Sharwanand) మరో క్రేజీ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లో కామెడీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ అంటే దర్శకుడు శ్రీను వైట్ల పేరు గుర్తుకు వస్తుంది. రీసెంట్ గా ఈ దర్శకుడు చెప్పిన కథ శర్వానంద్ కు బాగా నచ్చిందట. దీంతో ఈ ప్రాజెక్టుకి వెంటనే ఒకే చెప్పేశాడట శర్వా. ఇది కూడా శ్రీను వైట్ల మార్క్ లోనే పక్కా ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.

Ntr vs Allu Arjun: 2029లో ఇండస్ట్రీని ఏలేది ఈ ఇద్దరే.. వీళ్ళ జాతకాలు ఒక రేంజ్ లో ఉన్నాయట.. నెట్టింట క్రేజీ చర్చ

ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక టైటిల్ విపరీతంగా వైరల్ అవుతోంది. అదే ‘జార్జ్ కృష్ణ’. శ్రీను వైట్ల సినిమాల్లో క్యారెక్టర్ల పేర్లు, టైటిల్స్ చాలా వెరైటీగా, క్యాచీగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ‘జార్జ్ కృష్ణ’ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఒకవైపు మాస్ ఎలిమెంట్స్, మరోవైపు ఫుల్ లెంగ్త్ కామెడీ ట్రాక్‌తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. శర్వానంద్ టైమింగ్, శ్రీను వైట్ల మార్క్ కామెడీ తోడైతే బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

ప్రస్తుతం శర్వానంద్ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అవి ముగిసిన వెంటనే ఈ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మేకర్స్ అతి త్వరలోనే ఈ టైటిల్, సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. శ్రీను వైట్ల కూడా ఒక బలమైన కమ్ బ్యాక్ కోసం చూస్తుండటంతో, ఈ ‘జార్జ్ కృష్ణ’ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శర్వానంద్ తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు, మరి ఈ జార్జ్ కృష్ణ పాత్రలో ఆయన ఎలా మెప్పిస్తాడో చూడాలి.