Biker OTT: ఓటీటీలోకి శర్వానంద్ ‘బైకర్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

థియేటర్స్ లో మంచి విజయం సాధించిన శర్వానంద్ బైకర్(Biker OTT) మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధం అయ్యింది.

sharwanand biker movie ott release update

  • శర్వానంద్ హీరోగా వచ్చిన బైకర్ మూవీ
  • బైక్ రేసింగ్ కాంపస్ట్ తో వచ్చిన సినిమాకు హిట్ టాక్
  • ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్దమైన బైకర్
Biker OTT: చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ బైకర్.  మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మించగా మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. చాలా కాలం తరువాత సీనియర్ హీరో రాజశేఖర్ కీ రోల్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 3, 2026న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.
అద్భుతమైన విజువల్స్, రేసింగ్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం మంచి రిజల్ట్‌ను అందుకుంది. థియేటర్లలో భారీ స్పందన పొందిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై గర్జించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘బైకర్(Biker OTT)’ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా మే 1, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి థియేటర్స్ లో మంచి స్పందన తెచ్చుకున్న బైకర్ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది చూడాలి.