Pooja Hegde: టాలీవుడ్, కోలీవుడ్ అడపాదడపా బాలీవుడ్.. ఇలా మూడు భాషల్లో మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మగా బిజీ అయిపోయింది హాట్ బ్యూటీ పూజా హెగ్డే. దళపతి విజయ్ ‘బీస్ట్’ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూవీలో ఛాన్స్ కొట్టేసింది.
Evaru Meelo Koteeswarulu : రామ్ – భీమ్ ఎపిసోడ్ హయ్యెస్ట్ టీఆర్పీ..!
మహేష్‌తో ‘మహర్షి’, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’, ‘అల..వైకుంఠపురములో..’ తర్వాత పూజా పాప చేస్తున్న సినిమా ఇది. అయితే సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లాతో పూజాను పోలుస్తూ నెట్టింట ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అది కూడా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమాలతో కంపేర్ చేస్తూ..
Pooja Hegde : పూజా పాప క్రేజ్.. బన్నీతో మూడోసారి..
వివరాల్లోకి వెళ్తే.. ‘ఖుషి’, ‘ఒక్కడు’ ‘సింహాద్రి’ ఈ మూడు సినిమాలూ ఈ ముగ్గురు హీరోల కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అండ్ ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. పైగా ఈ ముగ్గురు హీరోలకూ ఈ మూడు సినిమాలూ 7వ సినిమా కావడం విశేషం. ఈ మూడు చిత్రాల్లోనూ భూమికనే హీరోయిన్. సేమ్ ఇలాంటి ఫీట్ పూజా హెగ్డే విషయంలోనూ రిపీట్ అయ్యింది.
తారక్ 28వ సినిమా ‘అరవింద సమేత’, త్రివిక్రమ్ – మహేష్‌తో చేస్తున్న మూవీలో పూజా పాపే హీరోయిన్. ఇది మహేష్ బాబు నటిస్తున్న 28వ ఫిలిం. పవర్‌స్టార్ – హరీష్ శంకర్ కాంబోలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పవన్ 28వ సినిమాలోనూ కథానాయికగా పూజానే ఫిక్స్ చేశారట. ఈ ముగ్గురు హీరోలకు తమ 7వ సినిమా హీరోయిన్ విషయంలో జరిగిన మ్యాజిక్ 28వ సినిమాకు కూడా జరుగబోతోంది.
Pooja Hegde : సమంతలానే పూజా పాపతో త్రివిక్రమ్ హ్యాట్రిక్ కొడతాడా?..