Pooja Hegde : సమంతలానే పూజా పాపతో త్రివిక్రమ్ హ్యాట్రిక్ కొడతాడా?..

కలిసొచ్చిన హీరోయిన్ అని, కెమిస్ట్రీ బాగా కుదిరిన భామ అని, గోల్డెన్ లెగ్ అని, లక్కీ ఛార్మ్ అని కథానాయికలను సినిమాల్లో రిపీట్ చేస్తుంటారు డైరెక్టర్లు. అప్పుడెప్పుడో సమంతని రిపీట్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్‌ని ముచ్చటగా మూడోసారి రిపీట్ చేస్తున్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్..

Pooja Hegde : సమంతలానే పూజా పాపతో త్రివిక్రమ్ హ్యాట్రిక్ కొడతాడా?..

Pooja Hegde In Mahesh Babu Trivikrams Movie

Pooja Hegde: కలిసొచ్చిన హీరోయిన్ అని, కెమిస్ట్రీ బాగా కుదిరిన భామ అని, గోల్డెన్ లెగ్ అని, లక్కీ ఛార్మ్ అని కథానాయికలను సినిమాల్లో రిపీట్ చేస్తుంటారు డైరెక్టర్లు. అప్పుడెప్పుడో సమంతని రిపీట్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్‌ని ముచ్చటగా మూడోసారి రిపీట్ చేస్తున్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

త్రివిక్రమ్ తన సినిమాల్లో హీరోయిన్‌ని చాలా స్పెషల్‌గా చూపిస్తారు. హీరోతో పాటు ఈక్వల్ స్పేస్ లేకపోయినా.. ఇంపార్టెన్స్ మాత్రం ఎక్కువగానే ఇస్తారు. అందుకే త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్లకి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. త్రివిక్రమ్ కూడా తనకు బాగా కలిసొచ్చిన హీరోయిన్‌ని రిపీట్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్‌గా మూడేళ్ల నుంచి తన లక్కీ ఛార్మ్ అయిన పూజాహెగ్డేతో ముచ్చటగా మూడోసారి సినిమా చెయ్యడానికి రెడీ అయ్యారు త్రివిక్రమ్.

Pooja Hegde

పూజాహెగ్డే, త్రివిక్రమ్‌తో ఇప్పటికే రెండు సినిమాలు చేసింది. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత’, లో అదిరిపోయే యాక్టింగ్‌తో ఎట్రాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలో తనే డబ్బింగ్ చెప్పుకుంది. ఆ సినిమా హిట్ కావడంతో బన్నీ పక్కన ‘అల..వైకుంఠపురములో..’ మూవీలో కూడా పూజానే రిపీట్ చేశాడు త్రివిక్రమ్. ఇక ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు మహేష్ బాబుతో చెయ్యబోతున్న సినిమాలో కూడా పూజా పాపనే ఫైనల్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్.

Samantha

 

పూజా హెగ్డే కంటే ముందు సమంతని కూడా ఇలా మూడు సార్లు తన సినిమాల్లో రిపీట్ చేశారు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సూపర్‌గా కనెక్ట్ అయిన సమంతని, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లో బన్నీకి జంటను చేసి మ్యాజిక్ చూపించారు. ఇక ఈ రెండు సినిమాల సక్సెస్‌తో నితిన్‌తో ‘అ..ఆ..’ సినిమాలో ముచ్చటగా మూడోసారి కూడా సమంతని తన కాంబినేషన్లో చూపించారు త్రివిక్రమ్. మరి పూజాతో కూడా త్రివిక్రమ్ హ్యాట్రిక్ కొడతాడేమో చూడాలి..

Pooja Hegde