Shilpa Shetty : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి ఇప్పటికి కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ సినిమాల్లో ఇంకా మెప్పిస్తుంది. నటిగానే కాక డ్యాన్సర్ గా యోగా ఇన్స్ట్రక్టర్ గా, నిర్మాతగా, టీవీ షోలలో జడ్జిగా.. ఇలా ఎన్నో పనులతో ఇప్పటికి కూడా బిజీ బిజీగా ఉంటూనే తన అందాన్ని ఏ మాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తుంది. ఇటీవల తన అందమైన ముఖానికి ఉన్న సీక్రెట్ టిప్ చెప్పేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శిల్పాశెట్టి మాటలాడుతూ.. ”కంటి నిండా నిద్ర పోవడమే నా ఫరెవర్ బ్యూటీ సీక్రెట్. ఎంత మంచిగా నిద్ర పోతే ఫేస్ అంత గ్లో ఉంటుంది. నేను పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను. సబ్బు వాడటం వల్ల మొహం మీది మృదువైన చర్మం పొడిబారుతుంది. అలాగే రోజూ రాత్రి పడుకునే ముందు స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో ఆలివ్ ఆయిల్ లేదా జాన్సన్ బేబీ ఆయిల్ కలిపి మొహానికి రాసి, కాటన్ తో తుడిచేస్తాను. దీనివల్ల మొహానికి సున్నితంగా మసాజ్ చేసినట్టయ్యి రక్తప్రసరణ బాగా జరిగి అలసట తీరి హాయిగా నిద్రపడుతుంది. దీంతో ఉదయం పూట కూడా మొహంలో గ్లో ఉంటుంది. ఈ కిటుకులన్నీ మా అమ్మ చెప్పినవే. వయసులో ఉన్నప్పుడు మొహానికి ఎన్ని కాస్మెటిక్స్ రాస్తే అంత త్వరగా వృద్ధాప్యం వస్తుందని ఆమె చెప్పింది. అందుకే నేను కాస్మెటిక్స్ ఎక్కువగా వాడను” అని తెలిపింది.
RRR : ఇలాంటి ఎంట్రీ ఎప్పుడూ చూడలేదు.. ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ వీడియో
మరి శిల్పాశెట్టి ఫేస్ గ్లోకి చెప్పిన సీక్రెట్ మీరు కూడా ట్రై చేస్తారా??