NBK109 : బాలయ్యకి విలన్‌గా టామ్ చాకో.. ఈ కాంబినేషన్ కోసమే చూస్తున్నామంటున్న ఫ్యాన్స్..
NBK109 సినిమాలో బాలయ్యకి విలన్‌గా షైన్ టామ్ చాకో నటించబోతున్నారా. ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ మలయాళ స్టార్ హీరోని..
- gum 95921
- Published On : March 12, 2024 / 05:49 PM IST
Shine Tom Chacko as villain in Nandamuri Balakrishna NBK109 movie
NBK109 : నందమూరి బాలయ్యతో దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్న సినిమా కోసం వరుసపెట్టి మలయాళ యాక్టర్స్ ని లైన్ లోకి తీసుకు వస్తున్నట్లు తెలుస్తుంది. యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ని ఎంపిక చేసినట్లు, అతని పై కొన్ని సీన్స్ ని కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఇక తాజాగా ఈ సినిమాలోకి మరో మలయాళ స్టార్ యాక్టర్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మలయాళ పరిశ్రమ నుంచి టాలీవుడ్ కి విలన్ గా పరిచయమైన నటుడు ‘షైన్ టామ్ చాకో’. తెలుగులో ఇప్పటివరకు చేసింది రెండు సినిమాలో అయినా.. విలన్ రోల్స్ లో తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో కూడా నెగటివ్ షేడ్ పాత్రలో నటిస్తున్నారు. అయితే చాలామంది తెలుగు ఆడియన్స్.. ఈ నటుడిని బాలయ్య సినిమాలో చూడాలని ఎప్పటినుంచో ఆశ పడుతున్నారు.
Also read : Allari Naresh : ‘ఆ ఒక్కటీ అడక్కు’ టీజర్ రిలీజ్.. కమ్మ, కాపు కులం ఏదైనా..
ఇప్పుడు ఆ ఆశలు అన్నిటిని బాబీ నిజం చేయబోతున్నట్లు తెలుస్తుంది. NBK109 సినిమాలోని ఓ విలన్ రోల్ కి టామ్ చాకోని సంప్రదించినట్లు, ఆయన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ న్యూస్ కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో.. ఈ కాంబినేషన్ కోసమే మేము చుస్తున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ నిజంగా స్క్రీన్ పై కనిపిస్తుందో లేదో చూడాలి.
కాగా ఈ సినిమాతో బాలయ్యని ఇప్పటివరకు చూపించినంత వైలెంట్ గా చూపిస్తానంటూ బాబీ చెప్పిన మాటల్ని.. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ తోనే నిజం చేసి చూపించారు. మొన్న రిలీజైన గ్లింప్స్ ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూపులు మొదలయ్యాయి. కాగా ఈ సినిమాని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మిస్తుంటే తమన్ మ్యూజిక్ చేస్తున్నారు.
