Allari Naresh : ‘ఆ ఒక్కటీ అడక్కు’ టీజర్ రిలీజ్.. కమ్మ, కాపు కులం ఏదైనా..

‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ మళ్ళీ అల్లరి నరేష్ మార్క్ ఎంటర్టైన్మెంట్‌ని చూడబోతున్నారా. రిలీజైన టీజర్ చూస్తుంటే..

Allari Naresh : ‘ఆ ఒక్కటీ అడక్కు’ టీజర్ రిలీజ్.. కమ్మ, కాపు కులం ఏదైనా..

Allari Naresh Faria Abdullah Aa Okkati Adakku Movie teaser release

Updated On : March 12, 2024 / 5:15 PM IST

Allari Naresh : అల్లరి నరేష్ నుంచి ఓ మంచి కామెడీ ఎంటర్టైనర్ వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. ఒకప్పుడు వరుస కామెడీ సినిమాలతో ఆడియన్స్ ని నవ్వించిన నరేష్.. మధ్యలో సరైన ఎంటర్టైనర్ లేక ఇబ్బందులు పడ్డారు. దీంతో కామెడీ ట్రాక్ నుంచి ఎమోషనల్ ట్రాక్ కి గేర్ మార్చి.. నాంది, ఉగ్రం వంటి సీరియస్ మూవీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఈ సినిమాలు చూసిన ఆడియన్స్.. మళ్ళీ నరేష్ ని కామెడీ సినిమాల్లో చూడలేమా అని బాధ పడ్డారు.

అయితే తనని హీరోగా నిలబెట్టిన కామెడీ ట్రాక్ ని అల్లరి నరేష్ ఎందుకు పక్కనబెడతారు. కామెడీకి కొంచెం గ్యాప్ ఇచ్చారంతే. ఇప్పుడు ఆ గ్యాప్ ని సాలిడ్ గా ఫిల్ చేయడానికి.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ ఓ మంచి కామెడీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ క్లాసీ టైటిల్ తో సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి హిట్టుని జనరేట్ చేసారో టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Also read : Ram Charan : అరేయ్ చిట్టిబాబు అంటూ.. రామ్‌చరణ్‌కి రంగమ్మ అత్త విషెస్.. వీడియో వైరల్

ఇటీవల ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ‘పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు’ అని అడిగి విసిగించే విషయం పాన్ ఇండియా ప్రాబ్లెమ్ అంటూ గ్లింప్స్ లో ఆకట్టుకున్నారు. ఇక తాజాగా టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ టీజర్ చూస్తుంటే.. ఒకప్పటి నరేష్ ఎంటర్టైన్మెంట్ ని ఈ సినిమాలో చూడబోతున్నామని తెలుస్తుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటిస్తున్నారు. నరేష్ అండ్ ఫరియా కాంబినేషన్ ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీలింగ్ ని ఇస్తుంది. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 22న రిలీజ్ కాబోతుంది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.