Ram Charan : అరేయ్ చిట్టిబాబు అంటూ.. రామ్‌చరణ్‌కి రంగమ్మ అత్త విషెస్.. వీడియో వైరల్
అరేయ్ చిట్టిబాబు అంటూ.. రామ్‌చరణ్‌కి రంగమ్మ అత్త స్టైల్ లో అనసూయ విషెస్. వైరల్ అవుతున్న వీడియో.

Anasuya Bharadwaj wishes to Ram Charan in rangammatta style
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్ యాంకర్ అనసూయ కెరీర్‌లో కూడా ‘రంగస్థలం’ సినిమా ఎంతో ముఖ్యమైనది. చిట్టిబాబుగా రామ్ చరణ్, రంగమ్మ అత్తగా అనసూయ ఆడియన్స్ గుండెలో నిలిచిపోయారు. మూవీలో ఈ రెండు పాత్రలను సుకుమార్ డిజైన్ చేసిన విధానం ప్రతి ఒక్కర్ని బాగా ఆకట్టుకుంది. ఇప్పటికి అనసూయ ఎక్కడైన కనిపిస్తే.. రంగమ్మ అత్త అని పిలిచేవారు ఎక్కువ ఉంటారు.
కాగా అనసూయ ప్రస్తుతం ‘రజాకార్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న అనసూయ.. తాజా ఇంటర్వ్యూలో రంగమ్మ అత్త స్టైల్ లో రామ్ చరణ్ కి విషెస్ తెలియజేసారు. ‘క్లీంకార’ పుట్టినందుకు రామ్ చరణ్ కి రంగమ్మ అత్త స్టైల్ లో విషెస్ చెప్పాలంటే.. ఎలా చెబుతారని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.
అనసూయ బదులిస్తూ.. “అరేయ్ చిట్టిబాబు పాప పుట్టింది అంటగా. చూడముచ్చటగా ఉన్నారు ముగ్గురు. జాగ్రత్తగా ఉండండే” అంటూ చెప్పుకొచ్చారు. అనసూయ మాటలతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మరోసారి చిట్టిబాబు, రంగమ్మ అత్త గుర్తుకు వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Also read : Salman Khan : హిట్ కోసం సౌత్ డైరెక్టర్స్‌నే నమ్ముకుంటున్న నార్త్ హీరోలు.. మొన్న షారుఖ్, నేడు సల్మాన్..
View this post on Instagram
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ చెంజర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 చేయబోతున్నారు. మరి గోదావరి బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతున్న ఈ మూవీలో అనసూయ, రామ్ చరణ్ తో కలిసి కనిపిస్తుందేమో చూడాలి. ఈ ఏడాది సమ్మర్ లో ఈ మూవీ స్టార్ట్ కానుందని సమాచారం.
మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ తో పాటు సుకుమార్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.