Shiva Kumar : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కంటెస్టెంట్.. శివ కుమార్.. ఇతని గురించి తెలుసా?
మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీగా సీరియల్ నటుడు శివకుమార్ ఎంట్రీ ఇచ్చాడు. (Shiva Kumar)
- Saketh U
- Published on- October 11, 2026 / 08:04 PM IST
Shiva Kumar
Shiva Kumar : ఈ వారం ఎలిమినేషన్ తో పాటు అయిదుగురు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కూడా వస్తారని నిన్నే ప్రకటించారు నాగార్జున. చెప్పినట్టే నేడు మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీగా సీరియల్ నటుడు శివకుమార్ ఎంట్రీ ఇచ్చాడు. కన్నడ నటుడు శివ కుమార్ పలు కన్నడ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకొని తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. మౌనరాగం, ఇంటికి దీపం ఇల్లాలు.. లాంటి పలు సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు.
ఇక తన లవర్, సీరియల్ నటి ప్రియాంక జైన్ తో రెగ్యులర్ గా వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటాడు శివ కుమార్. అలాగే ఈ ఇద్దరూ కలిసి పలు టీవీ షోలలో కనిపించి సందడి చేసారు. వెబ్ సిరీస్ లు కూడా నటిస్తున్నారు. త్వరలోనే ప్రియాంకని పెళ్లి చేసుకోనున్నాడు శివ. ప్రియాంక జైన్ బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొంది. మరి శివ కుమార్ ఎలాంటి ఆట ఆడతాడో చూడాలి.
